సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్
18-05-202018-05-2020 10:09:36 IST
Updated On 18-05-2020 10:47:26 ISTUpdated On 18-05-20202020-05-18T04:39:36.970Z18-05-2020 2020-05-18T04:38:24.080Z - 2020-05-18T05:17:26.611Z - 18-05-2020

క్రికెట్ పోటీలుంటే క్షణం తీరిక లేని ఆటగాళ్ళకు కరోనా వైరస్ లాక్ డౌన్ మంచి ఆటవిడుపుగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా వరుస వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ‘పోకిరి’, ‘బాహుబలి’ చిత్రాల్లోని డైలాగులు చెబుతూ, ‘అలవైకుంఠపురములో..’లోని పాటలకు చిందులేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.
డేవిడ్ వార్నర్ చాలాకాలంగా టిక్‌టాక్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ఎప్పటికప్పుడు తన వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడు. తాజాగా తెలుగు పాటకు తన భార్య క్యాండిస్‌తో కలిసి స్పెప్పులేసిన వీడియో వైరలైంది. ప్రముఖ తెలుగు సినిమా అలా వైకుంఠపురంలోని సూపర్‌హిట్ సాంగ్ బుట్టబొమ్మకు వార్నర్ దంపతులు డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలకు అటు ఆయన అభిమానులు, ఇటు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
తాజాగా ప్రభుదేవా పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇందులోని ‘ముక్కాబులా’ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల దీన్ని రీమిక్స్ చేశారు. ఇప్పుడు ఆ పాటకు వార్నర్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఎవరు బాగా చేశారంటూ ఇన్‌స్టాలో ఫ్యాన్స్ ని అడిగాడు.


IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
5 hours ago

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
7 hours ago

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
11 hours ago

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
12 hours ago

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
10 hours ago

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
16 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
20 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021
ఇంకా