newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

సేవ కోసం ఫుట్ బాల్ ఆడిన ధోనీ...

09-10-201909-10-2019 12:33:16 IST
Updated On 09-10-2019 12:36:56 ISTUpdated On 09-10-20192019-10-09T07:03:16.330Z09-10-2019 2019-10-09T07:03:13.774Z - 2019-10-09T07:06:56.054Z - 09-10-2019

 సేవ కోసం ఫుట్ బాల్ ఆడిన ధోనీ...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మహేంద్ర సింగ్ ధోనీ ఫుట్ బాల్ ప్రేమ, దాతృత్వ ఆలోచనను మరోసారి బయటపెట్టాడు. తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్ ను సేవా కార్యక్రమం కోసం ఆడాడు. క్రికెటర్లు, సినిమా వాళ్లు కలసి ఇలాంటి ఛారిటీ మ్యాచ్ లు ఆడటం గతంలోనూ చూశాం. తాజాగా రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో టీమిండియా వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌తో కలిసి ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడారు. 

రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఛారిటి మ్యాచ్‌ కోసం పలువురు క్రికెటర్లతో పాటు  బాలీవుడ్‌ నటుడు సమీర్‌ కొచ్చార్‌, కొరియోగ్రాఫర్‌ కేసర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని రితి స్పోర్ట్స్ సంస్థ తమ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతోపాటు ఆటగాళ్లతో ధోనీ కలసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ మ్యాచ్ కు ముందు ధోనీ ఆదివారం అర్జున్‌ కపూర్‌తో కలసి సరదాగా ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడాడు. 

గతేడాది అక్టోబర్‌లోనూ ముంబయిలో ఓ ఛారిటీ సంస్థ నిర్వహించిన మ్యాచ్ కోసం ధోనీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. అప్పుడు ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జొనాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ ధోనీతో కలిసి మైదానంలోకి దిగారు. ధోనీకి ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఇక ధోనీ క్రికెట్ విషయానికొస్తే...  వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు ధోనీ దూరంగా ఉంటున్నాడు.  ఆ మధ్య ఆర్మీలో కొద్ది రోజులు సేవలు అందించి వచ్చాడు. ఆ తర్వాత ధోనీ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు జట్టులోకి వస్తాడేమో అనుకున్నారు. కానీ మరికొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావించాడు. దీంతో రాబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడాధోనీ అందుబాటులో ఉండకపోవచ్చు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle