సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు
17-03-202017-03-2020 16:07:31 IST
2020-03-17T10:37:31.953Z17-03-2020 2020-03-17T10:37:29.978Z - - 17-04-2021

ప్రపంచాన్ని వణికిస్తోంది ఒకే ఒక్క వైరస్ కరోనా. దేశాలను దాటి ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంతా నడుం బిగిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పలువురు ప్రముఖులు తమ చేతులను శుభ్రపరుచుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులను కూడా దీనిని పాటించాలని ఛాలెంజ్ విసురుతున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్వీకరించి చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాకు విడుదలచేశారు.
అంతేకాదు కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించేందుకు అంతా నడుంబిగించాలని పిలుపునిచ్చారు. తన ఛాలెంజ్ లో భాగంగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ప్రతి ఒక్కరు తమ చేతులను సరైన విధంగా శుభ్రపరుచుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సింధు ఛాలెంజ్ విసిరింది ఎవరికో కాదు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా సారథి విరాట్ కోహ్లి, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలు ఈ జాబితాలో వున్నారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని వీడియో పోస్ట్ చేయాలని ఆమె కోరారు.
చేతులను శుభ్రం చేసుకోవడం, ప్రయాణాల్లోనూ శానిటైజర్ ఉపయోగించడం ద్వారా కరోనానుంచి తప్పించుకోవచ్చు. ముక్కుకి మాస్క్ వాడడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్ఛీప్ వాడడం చేయాలి.




CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
a day ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా