newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

సెమీస్‌లో టీం ఇండియా పనైపోయిందా?

10-07-201910-07-2019 16:17:41 IST
Updated On 10-07-2019 18:20:35 ISTUpdated On 10-07-20192019-07-10T10:47:41.396Z10-07-2019 2019-07-10T10:47:39.793Z - 2019-07-10T12:50:35.925Z - 10-07-2019

సెమీస్‌లో టీం ఇండియా పనైపోయిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వర్షం కారణంగా మంగళవారం ఆగిపోయిన మ్యాచ్ బుధవారం తిరిగి ప్రారంభించిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. టీమిండియా ఫైనల్‌ చేరేందుకు 240 పరుగుల మంచి లక్ష్యం నిర్దేశించింది.

చల్లని వాతావరణం, పిచ్‌ మందకొడిగా మారడంతో లక్ష్య ఛేదన కోహ్లీసేనకు అంత సులభం కాదని అంతా భావించారు. అదే నిజమయింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడం అభిమానులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. 24 పరుగులకే భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 

లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియా తొలి ఓవర్‌ను బౌల్ట్‌ వేసి 2 పరుగులు ఇచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ (1), రోహిత్‌ (1) నిలకడగా ఆడారు. మాట్‌ హెన్రీ వేసిన బంతి ఆడిన రోహిత్‌ శర్మ కేవలం ఒక్కపరుగుకే ఔటయ్యాడు. కీపర్‌ టామ్‌ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు రోహిత్.

అనంతరం టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. బౌల్ట్‌ వేసిన బంతి ఆడే క్రమంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరాడు కోహ్లీ. అయితే ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ కష్టాల్లో పడిందని భావిస్తున్నారు.

మాట్‌ హెన్రీ వేసిన బంతిని ఆడే క్రమంలో కేఎల్‌ రాహుల్‌ కూడా ఒక్క పరుగుకే ఔటయ్యాడు. టామ్‌ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు రాహుల్. దీంతో టీం ఇండియా వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. ఆరుఓవర్లకు భారత్ 10 పరుగులు చేసింది.

9.3 ఓవర్లలో భారత్ స్కోరు కేవలం 3 వికెట్ల నష్టానికి కేవలం 24 పరుగులు చేసింది. తర్వాత దినేష్ కార్తీక్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది ఇండియా. దీంతో 10 ఓవర్లలో 24 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. 11 ఓవర్లలో 30 పరుగులు చేసింది. 

అంతకుముందు రెండో రోజు మొదటి బంతి నుంచే భువనేశ్వర్‌ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పాటించాడు. 46.2వ బంతి నుంచి ఆట ఆరంభించగా 50 ఓవర్లలో న్యూజిలాండ్ 239 పరుగులు చేయగలిగింది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle