newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సూపర్ బోణీ.. ఫస్ట్ టీ20లో ఇండియా విక్టరీ

24-01-202024-01-2020 15:53:00 IST
Updated On 24-01-2020 15:57:45 ISTUpdated On 24-01-20202020-01-24T10:23:00.537Z24-01-2020 2020-01-24T10:22:59.043Z - 2020-01-24T10:27:45.735Z - 24-01-2020

 సూపర్ బోణీ.. ఫస్ట్ టీ20లో ఇండియా విక్టరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో న్యూజిలాండ్ తో ప్రారంభమయిన టీ20 సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. భారత్ విదేశీగడ్డపై తొలి టీ-20 సిరీస్ సమరానికి సిద్ధమయిన సంగతి తెలిసిందే.  ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి టీ-20 గెలిచి మంచి శుభారంభం అందించింది. టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 2, న్యూజిలాండ్ 6 ర్యాంకుల్లో వున్నాయి. కివీస్ ఇచ్చిన 204 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు సాధించి ఛేదించింది ఇండియా. 

తొలుత  బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. భారత్ కు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు కొలిన్ మున్రో 59, కానే విలియమ్సన్ 51, రోజ్ టేలర్ 54, మార్టిన్ గుఫ్తిల్ 30 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, జస్ప్రిట్ బుమ్రా, చాహల్, శివమ్ దూబే, జడేజాలు ఒక్కొక్క వికెట్లు తీశారు. 

204 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ప్రారంభంలో వికెట్లు పోగొట్టుకుంది. 19 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ పరుగుల తుఫాన్ కురిపించాడు. దీంతో న్యూజిలాండ్ పై 6వికెట్ల తేడా సునాయాసంగా గెలిచింది. అయ్యర్ 58, లోకేశ్ రాహుల్ 56, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle