newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సూపర్ ఓవర్లో హిట్ మ్యాన్ హిట్టింగ్

29-01-202029-01-2020 16:55:25 IST
2020-01-29T11:25:25.365Z29-01-2020 2020-01-29T11:25:23.330Z - - 17-04-2021

 సూపర్ ఓవర్లో హిట్ మ్యాన్ హిట్టింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా దూకుడుతో న్యూజిలాండ్ చిన్నబోయింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మూడు మ్యాచ్ లు గెలిచి టీం ఇండియా సిరీస్ ని కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ లో సూపర్ ఓవర్లో అద్భుత ప్రతిభ కనబరిచారు టీం ఇండియా ఆటగాళ్ళు. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు దాసోహం కాకతప్పలేదు. హామిల్టన్‌లో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరాఖరికి కోహ్లి సేనకే విజయం వరించింది. 

చివరి ఓవర్‌లో మ్యాజిక్‌ చేసి మ్యాచ్‌ను టై చేశాడు షమీ. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ పోరాటం వృథా అయింది. మూడో టీ20లో టీమిండియా ‘సూపర్‌’ ఓవర్ అద్బుత విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్దే నిలిచింది. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ టై అయింది. 

మ్యాచ్‌ విజేతను సూపర్‌ ఓవర్‌తో నిర్ణయించారు. సూపర్‌ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 17 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్‌ చేయగా, విలియమ్సన్‌, గప్టిల్‌లు బ్యాటింగ్‌ చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రోహిత్‌, రాహుల్‌లు జట్టుకు విజయాన్ని అందించారు. టిమ్‌ సౌతీ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు కొట్టగా, రాహుల్‌ ఓ ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

సూపర్‌ ఓవర్‌లో టీమిండియాకు సూపర్‌ విజయాన్ని అందించిన రోహిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మూడు మ్యాచ్ లలోను టీమిండియా తన అద్భుత ప్రతిభతో న్యూజిలాండ్ టూర్ ని శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ లో బుమ్రా నిరాశ పరిచినా, షమీ చివరి ఓవర్ అద్భుత బౌలింగ్ తో మేజిక్ చేశాడు. 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle