newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎస్‌కే చేసిన తప్పు ఏమిటి.. సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ షురూ

02-09-202002-09-2020 09:05:48 IST
Updated On 02-09-2020 09:14:10 ISTUpdated On 02-09-20202020-09-02T03:35:48.295Z02-09-2020 2020-09-02T03:34:37.612Z - 2020-09-02T03:44:10.602Z - 02-09-2020

సీఎస్‌కే చేసిన తప్పు ఏమిటి..  సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ షురూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల కరోనా వైరస్‌ బారినపడ్డ 13 మంది కోలుకున్నారంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్‌కే సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యంతో పాటు ఐపీఎల్‌ నిర్వహకులు తీవ్ర ఆందోళన చెందారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19న సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

మిగతా జట్లన్నీ క్వారెంటైన్‌ పూర్తి చేసుకుని మైదానంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టగా.. కరోనా కారణంగా చెన్నై ఆటగాళ్లు మాత్ర ఇంకా హోటల్‌ గదులకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్రారంభ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా లేదని, షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తులు కూడా వచ్చాయి. 

ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ ఆటగాళ్లంతా కోలుకున్నారని జట్టు సీఈఓ ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది. త్వరలోనే చెన్నై ప్లేయర్లు ప్రాక్టీస్‌ను సైతం ప్రారంభించే అవకాశం ఉంది. 

కరోనా లక్షణాలు కనిపించిన 13 మంది సీఎస్కే ఆటగాళ్లతోపాుటు దీపక్, రుతురాజ్ కూడా సెప్టెంబర్ 3న అంటే గురువారం జరగనున్న మరొక కరోనా పరీక్షకు సిద్ధమవుతారని, తమ జట్టు శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని విశ్వనాధన్ తెలిపారు. కాగా దీపక్, రుతురాత్ తమ 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని రెండు టెస్టుల్లో నెగటివ్ అని తేలిన తర్వాత మాత్రమే  జట్టులో తిరిగి చేరతారని స్పష్టం చేశారు. 

సెప్టెంబర్ 19న మొదలు కానున్న ఐపీఎల్ భారత్‌లో మహమ్మారి కోవిడ్-19 విస్తృతి కారణంగా యూఏఈకి మారిన విషయం తెలిసిందే.

సీఎస్‌కే చేసిన పొరపాటు ఏమిటి?

ఈ నెల 21 నుంచి యూఏఈలో ఆ జట్టు క్వారంటైన్‌లో ఉన్నా.. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించడమే కాకుండా సామాజిక దూరం రూల్‌ని బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యూఏఈలో ఉన్న మిగిలిన ఏడు జట్లలో కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోగా.. ఒక్క చెన్నై టీమ్‌లోనే 13 కేసులు నమోదవడం ఆ వాదనకు బలం చేకూరుస్తోంది. 

వాస్తవానికి యూఏఈ ప్రయాణం సమయంలోనూ చెన్నై టీమ్ ఆటగాళ్లు విమానంలో నిబంధనల్ని అతిక్రమించారంట. ఇక యూఏఈ పర్యటనకు బయల్దేరే ముందు భారత్‌లో సీఎస్‌కే నిర్వహించిన ఆరు రోజుల క్యాంపులో ఆటగాళ్లతో సహచర సిబ్బంది మాస్క్‌లు లేకుండానే కనిపించారు. ఈ మేరకు ఫోటోలకు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇదే ఆ జట్టు కరోనా బారిన పడటానికి కారణం కావొచ్చనేది ప‍్రధాన వాదన.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   12 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   16 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle