సిరీస్ కోసం ఇంగ్లండ్.. పట్టుకోసం పాక్ పాట్లు
21-08-202021-08-2020 11:36:07 IST
Updated On 21-08-2020 16:16:51 ISTUpdated On 21-08-20202020-08-21T06:06:07.656Z21-08-2020 2020-08-21T06:04:35.969Z - 2020-08-21T10:46:51.125Z - 21-08-2020

సౌతాంప్టన్: వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్.. వరుసగా రెండో సిరీస్ పట్టేయాలనే ఉత్సాహంతో ఉంది. మరోవైపు సిరీస్‌ను సమంగా ముగించాలని పర్యాటక పాకిస్థాన్ పట్టుదలతో కనిపిస్తోంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ ఇంగ్లండ్ వశం కానుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ జో రూట్ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు.జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌తో బౌలింగ్ మెరుగ్గానే ఉంది. ఇక పాక్ పేసర్లు షహీన్ అఫ్రీది, అబ్బాస్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. మసూద్, బాబర్, రిజ్వాన్‌తో పాక్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. పాకిస్థాన్ 2010 నుంచి ఇంగ్లండ్‌కు సిరీస్ కోల్పోలేదు. విజయం కోసం రెండు జట్లు నువ్వానేనా అన్నట్టుగా ఢీకొనేందుకు సిద్ధం కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో గెలుపు దారి నుంచి ఓటమి ఒడి చేరిన పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణించాలని చూస్తోంది. కానీ వరుణుడు ఏం చేస్తాడో చూడాలి. రెండో టెస్టు వేదిక సౌతాంప్టన్‌లోనే జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించొచ్ఛు. వర్షం కారణంగా రెండో టెస్టులో 134 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లో వెలుతురు లేమి కారణంగా ఆటకు ఎక్కువ ఆటంకం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓ అరగంట ముందుగానే మ్యాచ్‌ను ఆరంభించాలని నిర్ణయించారు. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకే మొదలు కానుంది. ఇక టాస్ 2:30కే పడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానానికి ఎగబాకుతుంది. మధ్యాహ్నం 3 గం. నుంచి సోనీ సిక్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
5 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
6 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా