సారధిగా సచిన్ విఫలమైంది అక్కడే.. ఆ పాయింట్లోనే.. మదన్ లాల్ వివరణ
20-06-202020-06-2020 10:40:32 IST
Updated On 20-06-2020 11:50:09 ISTUpdated On 20-06-20202020-06-20T05:10:32.235Z20-06-2020 2020-06-20T05:10:27.783Z - 2020-06-20T06:20:09.203Z - 20-06-2020

భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్లలో సచిన్ టెండూల్కర్ అగ్రగామిగా చెప్పవచ్చు. తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో ప్రతి బ్యాటింగ్ రికార్డునూ సచిన్ తన సొంతం చేసుకున్నాడు. రెండు ఫార్మేట్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు తనదే. వంద అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్. క్రికెట్ చరిత్రలోనే అసమాన ప్రతిభాపాటకవాలకు నిదర్శనంగా నిలిచాడు సచిన్. కానీ అంత గొప్ప దిగ్గజ క్రికెటర్‌కు కూడా ఒక వెలితి.. సారధిగా జట్టును విజయాల బాటలో నడిపించలేకపోయాడు. అత్యధిక పరుగులు, వంద సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్ అనుభవం, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగల సమర్థుడు, క్లిష్ట సమయాల్లో జట్టు సమైక్యతను కాపాడిన ఘనుడు ఇలా అనేక ప్రశంసలు, ఘనతలు అందుకున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గొప్ప సారథినని మాత్రం నిరూపించుకోలేకపోయాడు. అతడి కెరీర్లో ఏదైనా చిన్న అసంతృప్తి ఉందంటే అది కెప్టెన్సీనే. ఆటగాడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్న సచిన్ నాయకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడంటూ కొందరు బహిరంగంగానే విమర్శించారు. అయితే సారథిగా సచిన్ ఎక్కడ విఫలమయ్యాడో మాజీ క్రికెటర్, ప్రపంచకప్-1983 గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్‌లాల్ తాజాగా వివరించాడు. ‘సచిన్ గొప్ప సారథి కాదనే వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను. బాధ్యత గల సారథిగా అతడు తన వ్యక్తిగత ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ మిగతా పది మంది ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. మంచి ప్రదర్శన చేయాలని వారిపై ఒత్తిడి తేలేదు. అయితే ఆ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే సచిన్ కూడా గొప్ప సారథి అయ్యుండే వాడు అని మదన్ లాలా పేర్కొన్నాడు. క్రికెట్లో కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు సాధించలేము. ఆ ఒక్కడితో పాటు మిగతా పది మంది బాధ్యతాయుతంగా ఆడితేనే విజయం సాధిస్తాం. దీన్ని సమన్వయం చేయడం కష్టమే. కొని సార్లు సహచర ఆటగాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సచిన్ కాస్త వెనకపడ్డాడు. గొప్ప సారథి కాలేకపోయాడు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. 1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్ గల బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును ముందుండి నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
43 minutes ago

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
2 hours ago

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
5 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
9 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
21 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021
ఇంకా