సస్పెండ్.. సస్పెండ్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు దారెటు..!
11-09-202011-09-2020 16:31:38 IST
2020-09-11T11:01:38.894Z11-09-2020 2020-09-11T11:01:36.631Z - - 11-04-2021

దక్షిణాఫ్రికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ దక్షిణాఫ్రికా క్రికెటర్లనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఏమిటా అన్న డైలామాలో పడేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో వచ్చే మార్పులేమిటా అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఎంపికలో సరైయన విధంగా బోర్డు వ్వవహరిండం లేదని ఆరోపణలు వస్తుండడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వెంటనే బోర్డులోని సభ్యులు పదవుల నుంచి వైదొలగాని.. క్రికెట్ బోర్డు తమ పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేసింది. క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో చోటుచేసుకున్న ఈ సంక్షోభం ఎటువైపు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు వరుస వైఫల్యాలు చెందుతూ ఉండడంతో జట్టు ఎంపికలో చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ విషయాన్నీ సీరియస్ గా పరిగణించి ఆ దేశ క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ మరియు ఒలింపిక్ కమిటీ (సాస్కోక్) నుండి సిఎస్ఎకు లేఖ రాసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు ఒక్కొకరు తప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో సీఈవో థబాంగ్ మోర్ అనుచిత ప్రవర్తన కారణంగా వేటుకి గురవ్వడం సంచలనానికి దారితీసింది. బోర్డులో రాజకీయాల కారణంగా క్రికెట్ గాడి తప్పుతూ ఉందని భావించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం చివరికి క్రికెట్ బోర్డును సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సస్పెన్షన్ క్రికెటర్ల భవితవ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందా అని క్రికెట్ ప్రేమికులు తమ భయాలను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ ఉన్నారు. పలువురు ట్యాలెంట్ ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదని బోర్డు చర్యలకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
6 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
16 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్పై కోహ్లీ ప్రశంసలు
16 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా