newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సఫారీ సిరీస్‌కు విరాట్‌కు విశాంత్రి..? కెప్టెన్సీ రేసులో ఎవరంటే..?

04-03-202004-03-2020 09:35:37 IST
2020-03-04T04:05:37.961Z04-03-2020 2020-03-04T04:05:35.836Z - - 17-04-2021

సఫారీ సిరీస్‌కు విరాట్‌కు విశాంత్రి..? కెప్టెన్సీ రేసులో ఎవరంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఈనెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. 12న తొలి వన్డే ధర్మశాలలో, 15న ల‌క్నో, 18న కోల్‌క‌తాలో రెండు, మూడు వ‌న్డేలు జ‌రుగనున్నాయి. అయితే.. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి విశ్రాంతి నిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతుండడంతో కోహ్లీకి ఈ సిరీస్‌కి విశాంత్రి నివ్వనున్నారు. కాగా వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ అందుబాటులో ఉండే ఛాన్స్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని అనే విషయం పై సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారట. ఇలా కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ లేకుండా ఐదేళ్ల తరువాత టీమిండియా బరిలోకి దిగనుంది.

ఇదిలా ఉంటే.. కెప్టెన్సీ రేసులో ఓ ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌, లోకేష్‌రాహుల్, శ్రేయాస్‌ అయ్యర్‌. వీరిలో అత్యంత సినీయర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌. 2018 నిదాహ‌స్ ట్రోఫీ, ఆసియాక‌ప్‌ల్లో ధావ‌న్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవల గాయంతో బాధపడినా.. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని సమాచారం. గ‌తంలో ఇండియా-ఎ, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ రాష్ట్ర జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లోకేష్‌ రాహుల్ విధ్వంసక ఫామ్‌లో ఉన్నాడు. ఏ స్థానంలో బరిలోకి దిగినా.. పరుగుల మోత మోగిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ రైట్ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవం అయితే లేదు గానీ.. ఓ మ్యాచ్‌లో మాత్రం విరాట్‌కు విశాంత్రి నిచ్చిన సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో .. విరాట్‌కు విశ్రాంతినివ్వగా.. ఆ టైంలో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వహించాడు. దీంతో అతడ్ని బావి కెప్టెన్‌గా క్రీడా పండితులు అభివర్ణించారు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్.. 13వ సీజన్‌(ఐపీఎల్ 2020)లో సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. టీమిండియాను ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నెం.4 స్థానం. ఆ స్థానంలో బరిలోకి దిగుతున్న ఈ యువ ఆటగాడు ఆ స్థానానికి తగిన న్యాయం చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా.. జూనియర్‌ లెవల్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం అతని సొంతం. ఇండియా-ఎ టీమ్‌ను అన్ని ఫార్మాట్ల‌లో సార‌థిగా న‌డిపిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. గ‌తేడాది శ్రేయ‌స్ సారథ్యంలోనే ఆరేళ్ల త‌ర్వాత ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. అలాగే ముంబైని రెండేళ్ల కింద‌ట విజ‌య్ హ‌జారే ట్రోఫీని అందించాడు.

విరాట్‌కు విశాంత్రి నిచ్చి రోహిత్ గనుక ఫిట్‌గా లేకపోతే.. ఈ ముగ్గురిలో ఒకరు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ ప్రకారం చూసుకుంటే.. ఈ ముగ్గురిలో లోకేష్‌ రాహుల్‌ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే..

భారతగడ్డపై ఈనెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే మూడు వ‌న్డేల సిరీస్‌కు త‌మ జ‌ట్టును ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) తాజాగా ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన ఈ బృందానికి వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ క్వింట‌న్ డికాక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ఈ సిరీస్ ద్వారా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పునరాగ‌మ‌నం చేస్తున్నాడు. గ‌త‌డేది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఘోర ప‌రాభం తర్వాత.. డుప్లెసిస్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. ఆసీస్‌తో తొలి వ‌న్డేలో డ‌కౌట్ అయిన మ‌లాన్ స్థానంలో డుప్లెసిస్ ను ఎంపిక చేశారు. .

భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు: క్వింట‌న్ డికాక్ (కెప్టెన్‌), టెంబా బ‌వుమా, ర‌స్సీ వాన్ డ‌ర్ డ‌స్సెన్‌, డుప్లెసిస్‌, కైలీ వెర్రేన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, జాన్ స్మ‌ట్స్‌, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూర‌న్ హెండ్రిక్స్‌, ఆన్రిచ్ నోర్జ్‌, జార్జ్ లిండే, కేశ‌వ్ మ‌హారాజ్‌.

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   14 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle