newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

సన్ రైజర్స్ మళ్ళీ ఓటమి.. డీసీ దూకుడు

15-04-201915-04-2019 13:31:47 IST
2019-04-15T08:01:47.736Z15-04-2019 2019-04-15T08:01:45.686Z - - 22-07-2019

సన్ రైజర్స్ మళ్ళీ ఓటమి.. డీసీ దూకుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కి చుక్కెదురైంది. టార్గెట్ ఛేదనలో చతికిలబడి 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సన్‌రైజర్స్‌ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి నమోదైంది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ (4/22), మోరిస్‌ (3/22), కీమో పాల్‌(3/17) సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ నడ్డివిరిచారు.

హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(51), బెయిర్‌ స్టో(41)లు శుభారంభం అందించారు. కానీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా బెయిర్‌ స్టో అవుటైన తర్వాత విలియమ్సన్ (3)తో పాటు సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు బాట పట్టారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రికీ భుయ్‌(7), శంకర్‌(1), హుడా(3), అభిషేక్‌(3), రషీద్‌(0)లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్‌కు ఘోర ఓటమి తప్పలేదు. 

తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా (4), శిఖర్‌ ధావన్‌(7) విఫలమయ్యారు. ఆ తర్వాత కొలిన్‌ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోతుంటే, శ్రేయాస్‌ అయ్యర్‌(45; 40 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్ అదరగొట్టాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌(23), అక్షర్‌ పటేల్‌(14)లు రెండంకెల స్కోరు చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు. మ్యాచ్ ఓటమి అనంతరం స్పందించాడు సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్. బౌలింగ్‌లో మేం అద్భుతంగా రాణించామని.. కానీ బ్యాటింగ్‌లో తడబడ్డామని అభిప్రాయపడ్డాడు. మా వైఫల్యాలను ఢిల్లీ ఆటగాళ్లు అందిపుచ్చుకుని అద్భుతంగా చెలరేగారన్నాడు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle