newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సన్ రైజర్స్ కోసం క్యూ కడుతున్న కంపెనీలు

27-08-202027-08-2020 19:15:42 IST
Updated On 28-08-2020 16:10:25 ISTUpdated On 28-08-20202020-08-27T13:45:42.717Z27-08-2020 2020-08-27T13:44:59.274Z - 2020-08-28T10:40:25.870Z - 28-08-2020

సన్ రైజర్స్ కోసం క్యూ కడుతున్న కంపెనీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియాలో క్రికెట్ పోటీలు జరగడంలేదు. క్రికెట్ ప్రేమికులు బాగా ఇష్టంగా చూసే ఐపీఎల్ వేడుక వచ్చేనెల నుంచి అబుదాబిలో జరగనుంది. ఇప్పటికే జట్లన్నీ యూఏఇ చేరుకున్నాయి. మరోవైపు ఐపీఎల్ కోసం 13 మంది సన్ గ్రూప్ యాజమాన్యంలోని టీం ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 

2016 ఐపీఎల్ ఛాంపియన్లకు ప్రిన్సిపల్ స్పాన్సర్ల శ్రేణిలో ముందున్నది జేకే లక్ష్మి సిమెంట్ లిమిటెడ్. ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్ బ్రాండ్ టైటిల్ స్పాన్సర్‌గా సంతకం చేసి వచ్చే నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం ఫ్రాంచైజ్ నిలుపుకోగలిగింది. టైటిల్ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్ లోగోను జట్టు ఆటగాళ్ల “జెర్సీ” ముందు భాగంపై ముద్రిస్తారు. రాల్కో టైర్లు, వాల్వోలిన్ ఇతర ప్రధాన స్పాన్సర్‌లు. వారి లోగోలు వరుసగా జెర్సీ ముందు వెనుక, కుడి ఎగువ ఛాతీపై ఉంటాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో, ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ టెక్నాలజీ, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫాం డ్రీమ్ 11, జై రాజ్ స్టీల్, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్, కోల్గెట్ కంపెనీలు ఐపీఎల్ సీజన్ 13 కోసం భాగస్వాములుగా సంతకం చేశాయి. వారి లోగోలు, బ్రాండింగ్‌లు జట్టు మ్యాచ్‌లో ప్రదర్శిస్తారు.

స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ బ్రాండ్ టైకా, ఫ్యాన్‌కోడ్, వర్చువల్ రియాలిటీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ఐబీ క్రికెట్, ఫుడ్ బ్రాండ్ డబుల్ హార్స్ కూడా ఫ్రాంచైజీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఐపీఎల్ అసలు జరుగుతుందో లేదో తెలీని పరిస్థితుల్లో కంపెనీలు సన్ రైజర్స్ కోసం ముందుకు రావడం ప్రోత్సాహకరంగా వుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే షణ్ముగం అంటున్నారు. మా భాగస్వాములకు అలుపెరుగని మద్దతు లభించినందుకు మేం గర్వంగా, కృతజ్ఞతతో ఉన్నామన్నారు. కరోనా వ్యాపించకుండా అనేక చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ. మరి ఐపీఎల్ ఎలా జరుగుతుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle