newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు విక్టరీ విషెస్‌

21-09-202021-09-2020 16:59:49 IST
Updated On 21-09-2020 17:00:22 ISTUpdated On 21-09-20202020-09-21T11:29:49.799Z21-09-2020 2020-09-21T11:29:40.692Z - 2020-09-21T11:30:22.700Z - 21-09-2020

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు విక్టరీ విషెస్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్ ఆలస్యంగా ప్రారంభమైనా కూడా క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలు మజా అందిస్తోంది. నేడు బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి ఘనంగా టోర్నిని ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

విక్టరీ వెంకటేష్‌ సినిమాలతో పాటుగా క్రికెట్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లు జరుగుతుందంటే హీరో వెంకటేష్‌ కచ్చితంగా స్టేడియానికి వస్తాడు. ఈలలు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. హైదరాబాద్‌ టీమ్‌కి మంచి సపోర్ట్ ఇవ్వడం మనం చూశాం. ప్రస్తుతం కరోనా కారణంగా ఐపీఎల్‌ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్  టీమ్‌ను సపోర్ట్ చేస్తూ వెంకటేష్‌ ఓ ట్వీట్ చేశాడు. 'ఆల్‌ దిబెస్ట్ SRH... నేను మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఉత్సాహపరుస్తాను' అని వెంకీ పోస్ట్ చేశాడు

వెంకటేష్‌ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఆరెంజ్‌ ఆర్మీ) బదులిచ్చింది. 'స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా' అని రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఈ ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ జట్లు 15 సార్లు తలపడగా.. 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ బావిస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle