newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

17-02-202017-02-2020 13:10:26 IST
Updated On 17-02-2020 14:35:22 ISTUpdated On 17-02-20202020-02-17T07:40:26.481Z17-02-2020 2020-02-17T07:40:24.666Z - 2020-02-17T09:05:22.066Z - 17-02-2020

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోనేరు హంపి తన సత్తా చాటుకుంది. చదరంగంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. భార‌తీయ గ్రాండ్‌మాస్ట‌ర్ కోనేరు హంపి.. అమెరికాలో జ‌రిగిన కెయిన్స్ క‌ప్ చెస్ టోర్న‌మెంట్‌ను గెలుచుకుంది.  9 రౌండ్ల టోర్నీలో.. హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.  మ‌రో రౌండ్ మిగిలి ఉండగానే.. ఆమె విజయం సాధించింది.  కెయిన్స్ క‌ప్‌ను నిర్వ‌హించ‌డం ఇది రెండ‌వ‌సారి.  

ఇంట‌ర్నేష‌నల్ చెస్ స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ఈ టోర్నీనిర్వహించారు. ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ జూ వెంజున్‌.. అయిదున్న‌ర పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచింది.  ర‌ష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గ‌త ఏడాది మ‌హిళ‌ల రాపిడ్ చెస్ చాంపియ‌న్‌షిప్‌ను గ్రాండ్‌మాస్ట‌ర్ కోనేరు హంపి గెలుచుకుంది. ఆ టోర్నీలో చైనాకు చెందిన లీ యంగ్జీపై ఆమె విజ‌యం సాధించింది. కెయిన్స్ క‌ప్ విజేత హంపికి.. టోర్నీ నిర్వాహ‌కులు ట్రోఫీతో పాటు 45వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ అందుకుంది. కెయిన్స్ కప్ సాధించిన హంపిని పలువురు అభినందించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle