newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సచిన్ లాంటి క్రికెటర్ మళ్లీ పుట్టడు.. ఇంజీ ప్రశంసలు

28-02-202028-02-2020 14:33:32 IST
2020-02-28T09:03:32.425Z28-02-2020 2020-02-28T09:03:29.723Z - - 11-04-2021

సచిన్ లాంటి క్రికెటర్ మళ్లీ పుట్టడు.. ఇంజీ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌లో, ప్రపంచ క్రికెట్‌లో కూడా సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును, పరుగుల రికార్డును ఎవరు బ్రేక్‌ చేస్తారో చూడాలని ఉందంటూ పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ ఇంజమాముల్‌ హక్‌ సవాల్ విసిరాడు. తమ శకంలో సచిన్‌ ఒక అసాధారణ క్రికెటర్‌ అంటూ ప్రశంసించిన హక్ ఈ మేరకు తన యూట్యూబ్‌ చానల్‌లో సచిన్‌ గురించి పలు విషయాలను వెల్లడించాడు. 

దాదాపు 24 సంవత్సరాలపాటు నిరవధికంగా క్రికెట్ ఆడిన సచిన్ 2013లో ఆటకు వీడ్కోలు పలికాడు. కానీ సచిన్ ఎన్నటికీ క్రికెట్‌కు దూరం కాకుండా ఉండే బాగుండేదిని ఇంజీ ముక్తాయించాడు. సచిన్‌లా క్రికెట్ ఆడేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే నేను నమ్మలేను. తాను తీసిన పరుగులను భవిష్యత్తులో ఎవరైనా అధిగమించవచ్చు కానీ ఆటను సచిన్‌లాగా మమేకమై అస్వాదించే క్రికెటర్‌ను ఎవరూ చూడలేరు. అతడు క్రికెట్ నుంచి ఎన్నటికీ దూరం జరగకపోయి ఉంటే బాగుండేది అంటూ ఇంజీ సచిన్‌పై ఆకాశానికెత్తేశాడు. తన మాటల్లో చెప్పాలంటే...

"సచిన్‌ క్రికెట్‌ కోసమే పుట్టాడు. క్రికెట్‌-సచిన్‌లు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లే ఉంటుంది. 16-17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి దిగ్గజ బౌలర్లను సైతం సచిన్‌ వణికించాడు. కేవలం అతనికి మాత్రమే సాధ్యమైన రికార్డులతో క్రికెట్‌కు వన్నెతెచ్చాడు. 

మా టైమ్‌లో అసాధారణం అనేది ఏదైనా ఉందంటే అది సచిన్‌. ఎంతో మంది దిగ్గజ బౌలర్లకు సచిన్‌ దడపుట్టించాడు. వకార్‌ యూనస్‌, వసీం అక్రమ్‌ వంటి బౌలర్లకు సచిన్‌ తన 16 ఏళ్ల వయసులోనే చుక్కలు చూపించాడు. పేస్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ఎటాక్‌ చేసేవాడు. అదే సమయంలో రికార్డుల మోత మోగించాడు. 

ఆ శకంలో పరుగులు చేయడమంటే అంత ఈజీ కాదు. అప్పటివరకూ సాధారణంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల లోపు పరుగులు చేస్తేనే అదొక గొప్ప విషయం. సునీల్‌ గావస్కర్‌ సాధించిన 10వేల పరుగులే అప్పట్లో గొప్ప. ఆ రికార్డు బ్రేక్‌ అవుతుందని అనుకోలేదు. కానీ సచిన్‌ వరుసగా అన్ని రికార్డులను కొల్లగొట్టుకుంటూ పోయాడు. మరి సచిన్‌కే అది సాధ్యమైందంటే క్రికెట్‌ దేవుడే కదా. ఇక ఇప్పుడు సచిన్‌ రికార్డులను ఎవరు బ్రేక్‌ చేస్తారో చూడాలని ఉంది" అని ఇంజమామ్‌ తెలిపాడు. 

'ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సచిన్‌ లెగ్‌ స్పిన్‌, ఆఫ్‌ స్పిన్‌, మీడియం పేస్‌ బౌలింగ్‌ వేస్తూ ఉండేవాడు. మూడు రకాలుగా బౌలింగ్‌ వేయడంలో మంచి నైపుణ్యాన్ని సచిన్‌ ప్రదర్శించేవాడు. భారత్‌ బౌలింగ్‌లో సచిన్‌ వేసే గుగ్లీలే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. అతనికే చాలా సార్లు ఔటయ్యాను కూడా’ అని సచిన్‌ బౌలింగ్‌ గురించి ఇంజీ చెప్పుకొచ్చాడు. 

భారత క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఒక సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలను సాధించిన ఏకైక క్రికెటర్‌. టెస్టుల్లో 51 శతాకాలు సాధించిన సచిన్‌.. వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్‌ 1990లో మొదటి టెస్టు సెంచరీ, 1994 తొలి వన్డే సెంచరీ సాధించాడు. 

తన శకంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుల కొల్లగొడుతూ పరుగుల మోతమోగించాడు. సచిన్‌ తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. 200 టెస్టుల్లో 15, 921 పరుగులు సాధించగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు నమోదు చేశాడు. ఇక ఏకైక అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ సచిన్‌ ఆడాడు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle