newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

02-07-202002-07-2020 16:45:58 IST
Updated On 02-07-2020 16:52:30 ISTUpdated On 02-07-20202020-07-02T11:15:58.796Z02-07-2020 2020-07-02T11:15:56.034Z - 2020-07-02T11:22:30.826Z - 02-07-2020

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన ఆసీస్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ తన వినూత్నమైన, విచిత్రమైన పద్ధతులతో చాలామంది భారత క్రికెటర్ల కెరీర్లను నాశనం చేశాడని ఇప్పటికీ విమర్శల పాలవుతూనే ఉన్నాడు. అతడి కోచింగ్ పద్ధతులకు బలైన వారిలో మాజీ స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఒకరని పలు కథనాలు వచ్చాయి కూడా. కానీ బౌలర్‌గా ఉన్న తనను బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్ చేసింది గ్రెగ్ చాపెల్ కాదని, సచిన్ టెండూల్కరేనని ఇర్ఫాన్ తాజాగా ప్రకటించి సంచలనం కలిగించాడు.

తనను బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్ చేసింది సచినే తప్ప గ్రెగ్ చాపెల్ కాదని టీమిండియా మాజీ స్వింగ్‌ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2005లో శ్రీలంకలో నాగ్‌పూర్‌తో జరిగిన తొలి వన్డేలో ఇర్ఫాన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 83 పరుగులతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 152 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత పలుమార్లు పఠాన్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న పఠాన్‌ మరోసారి ఆ విషయాలను గుర్తు చేసుకున్నాడు.

'నేను నా రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాను. నన్ను ఆల్‌రౌండర్‌గా మూడో స్థానంలో పంపి గ్రేగ్‌ చాపెల్ నా కెరియర్‌ను నాశనం చేశాడని చాలా మంది భావిస్తారు. అయితే, నిజానికి నన్ను మూడో నంబరులో పంపాలన్నది సచిన్ ఆలోచన. నన్ను ఆ స్థానంలో పంపాలని ద్రవిడ్‌కు సచిన్ సూచించాడు. అతడికి సిక్సర్లు కొట్టే సత్తా ఉంది. కొత్త బంతిని ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలర్లను చక్కగా ఆడగలడు అని కూడా సచిన్ చెప్పాడు.' అంటూ పఠాన్‌ పేర్కొన్నాడు. 

గ్రెగ్‌ చాపెల్‌ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాపెల్‌ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్‌ సూచనలతో ఇర్ఫాన్‌ తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్‌ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్‌ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్‌ కంటే బ్యాటింగ్‌పై పఠాన్‌ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్‌.

దీంతో ఓ సమయంలో పఠాన్‌ బౌలర్‌ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్‌ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్‌ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పఠాన్‌ టీమిండియా తరఫున 29 టెస్టుల్లో 100 వికెట్లు, 120 వన్డేల్లో 173వికెట్లు, 24 టీ20ల్లో 28వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ ఏడాది జనవరిలోనే క్రికెట్‌కు ఇర్ఫాన్‌ పఠాన్‌ వీడ్కోలు పలికాడు. 

సచిన్ ప్రతిపాదనతోనే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇర్ఫాన్ అనేకసార్లు జట్టును ఆదుకున్నాడు. చివరకు చాలాసార్లు భారత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కూడా అయ్యాడు. కానీ తనను బౌలర్ స్థానం నుంచి బ్యాట్స్‌మన్‌గా మలిచి కెరీర్ పాడుచేశాడని అందరూ గ్రెగ్ చాపెల్‌ను ఆడిపోసుకుంటున్నారని, కాని ఇది నిజం కాదని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. చాపెల్ ఇప్పుడు భారతదేశంలో లేడు కాబట్టి అందరూ అతడిపై పడుతున్నారని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.

తన కెరీర్ ముందుకు సాగుతుండగా జట్టులో తన పాత్ర ఏమిటి అనే అంశంపై టీమ్ యాజమాన్యం తనతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయిందని, అందుకే శరవేగంగా 59 మ్యాచ్‌లలో 100 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించినప్పటికీ ఆ తర్వాత తన పాత్రను మార్చి బ్యాట్స్‌మన్‌గా ముందుకు నెట్టారని. ఆ తర్వాతే బౌలర్‌గా తన లయ తప్పి అటూ ఇటూ కాకుండా పోయానని ఇర్ఫాన్ వాపోయాడు. త

తన ఉత్థాన పతనాలకు టీమ్ యాజమాన్యం కారణం కాగా విదేశీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై అందరూ పడుతుండటంపై ఇర్ఫాన్ అసహనం వ్యక్తం చేశాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle