newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

24-02-202024-02-2020 17:35:23 IST
Updated On 25-02-2020 12:02:29 ISTUpdated On 25-02-20202020-02-24T12:05:23.678Z24-02-2020 2020-02-24T12:05:20.997Z - 2020-02-25T06:32:29.190Z - 25-02-2020

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నమస్తే ట్రంప్ అంటూ భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. ట్రంప్ నోటివెంట ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల మాటలు వినిపించాయి. వాళ్ళెవరో కాదు భారత రత్న సచిన్ టెండూల్కర్, విరాటో కోహ్లీ. భారత్‌ సచిన్‌, విరాట్‌ కోహ్లీ గొప్ప క్రికెటర్లకి చిరునామా అని ట్రంప్ అన్నారు. అలాంటి క్రికెటర్లు భారత్‌కు ఎన్నో విజయాలు అందించారని, ఇప్పటి భారత్ వరకూ గొప్ప క్రీడాకారులను అందించిందని ప్రశంసించారు. భారత్ అద్భుతమైన అవకాశాలకు నెలవని అన్నారు.

సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. సచిన్ ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. మొత్తం 200 టెస్టులు ఆడాడు. 51 శతకాలతో పాటు , 68 అర్థశతకాలు 15,921 పరుగులు ఉన్నాయి. అలాగే 463 వన్డేల్లో 49 శతకాలు, 96 అర్థశతకాలు 18,426 పరుగులు సాధించారు. వన్డేల్లో 200 పరుగు సాధించిన తొలి క్రికెటర్ గా సచిన్ రికార్డు సాధించారు. విరాట్ కోహ్లీ ప్రస్థుత టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నారు.

సచిన్ తర్వాత ఎన్నో ఘనతలు కోహ్లీ సృష్టించాడు. 248 వన్డేల్లో 11,867 పరుగులతో కోహ్లీ 43 శతకాలు సాధించాడు. మొత్తం మీద ట్రంప్ పొగడ్తలతో సచిన్, కోహ్లీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle