newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సచిన్ కొట్టిన ఆ సిక్స్.. ఒక ఐకానిక్ సిక్స్.. షోయబ్ ఫిదా

20-04-202020-04-2020 15:18:10 IST
Updated On 20-04-2020 15:21:27 ISTUpdated On 20-04-20202020-04-20T09:48:10.561Z20-04-2020 2020-04-20T09:48:05.518Z - 2020-04-20T09:51:27.213Z - 20-04-2020

సచిన్ కొట్టిన ఆ సిక్స్.. ఒక ఐకానిక్ సిక్స్.. షోయబ్ ఫిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక సిక్సర్ 100 కోట్లమందికి పైగా భారతీయులను అంతగా రంజింపజేస్తే,, అలాంటి సిక్స్‌ను ప్రతిరోజూ తాను వారికి సమర్పించుకునేవాడిని అని పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. 2003 వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్లో తన బౌలింగ్‌లో సచిన్ కొట్టిన్ సిక్స్ నిజంగా ఆణిముత్యం లాంటిదని అక్తర్ ప్రశంసించాడు. అయితే ప్రపంచం గర్వించదగిన సచిన్ లాంటి మేటి క్రికెటర్‌ను తన కెరీర్‌లో 13 సార్లు ఔట్ చేసినందుకు మాత్రం గర్విస్తానని అక్తర్ చెప్పాడు.

దాదాపు 17 ఏళ్ల నాటి వన్డే వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్‌ అక్తర్‌ గుర్తు చేసుకున్నాడు. ఆనాడు భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా తన బౌలింగ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొట్టిన అప్పర్‌ కట్‌ సిక్స్‌ ఒక ఐకానిక్‌ సిక్స్‌ అని అక్తర్‌ అభివర్ణించాడు. సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన మరో ఆణిముత్యం ఆ సిక్స్‌ అని కొనియాడాడు. 

సెంచూరియన్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సచిన్‌ 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివరకు షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌లోనే సచిన్‌ ఔటయ్యాడు. ఆ అద్భుతమైన మ్యాచ్‌లో చివరికి సచిన్‌ను తానే ఔట్‌ చేశానని అక్తర్‌ చెబుతూనే.. ఆనాడు మాస్టర్‌ కొట్టిన సిక్స్‌ను కూడా ప్రస్తావించాడు. ఇక్కడ ఆ సిక్స్‌ యావత్‌ భారతావనిని సంతోషంలో ముంచెత్తి ఉంటుందన్నాడు. కోట్లాది భారతీయలకు ఒక సిక్స్‌ సంతోషాన్నిస్తే.. తాను ప్రతీ రోజూ సచిన్‌కు సిక్స్‌ను సమర్పించుకునేవాడినని అక్తర్‌ అన్నాడు. 

‘క్రికెట్‌ ఆడుతున్నప్పట్నుంచి సచిన్‌ నాకు బాగా తెలుసు. నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతనొక అరుదైన బ్యాట్స్‌మన్‌. అంతేకాకుండా సహచర క్రికెటర్ల పట్ల సచిన్‌ చాలా వినయపూర్వకంగా ఉండేవాడు. ప్రపంచ గర్వించదగ్గ క్రికెటర్‌. అలాంటి క్రికెటర్‌ను నేను 12-13 సార్లు ఔట్‌ చేసినందుకు చాలా గర్విస్తా’ అని అక్తర్‌ తెలిపాడు. 

పాకిస్తాన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జైనబ్‌ అబ్బాస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అక్తర్‌ పలు విషయాల్ని వెల్లడించాడు. ‘ఆనాటి వరల్డ్‌కప్‌లో సెంచూరియన్‌ మ్యాచ్‌లో నా బౌలింగ్‌లో సచిన్‌ అప్పర్‌ కట్‌ షాట్‌తో సిక్స్‌గా మలచాడు. అది భారతీయుల్ని కచ్చితంగా సంతోషంలో ముంచెత్తిన క్షణమది. ఇప్పటికీ ఆ సిక్స్‌ను ఎక్కువగా చూపెడుతూ ఉంటారు.  ఒక సిక్స్‌ బిలియన్‌కు పైగా ఉన్న భారతీయుల్ని ఆనందాన్ని తీసుకు వస్తుందనే విషయం తెలిస్తే వారితో మ్యాచ్‌లో ప్రతీసారి నేను సిక్స్‌ను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండేవాడిని’ అని అక్తర్‌ తెలిపాడు. 

పాకిస్తాన్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ 274 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది. భారత్‌ ఓపెనర్‌గా దిగిన సచిన్‌.. అక్తర్‌ వేసిన రెండో ఓవర్‌లోనే విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో అక్తర్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ వైడ్‌ బాల్‌ను థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఒక అద్భుతమైన సిక్స్‌ను కొట్టిన సచిన్‌.. ఆ తర్వాత రెండు బంతుల్ని కూడా బౌండరీలుగా తరలించాడు. 

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే షోయబ్ అక్తర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందాడు. తన పదేళ్లకు పైగా అనితర సాధ్యమైన ఆ వేగంతోటే షోయబ్ క్రికెట్  ప్రపంచంలో బ్యాట్స్‌మన్‌ను వణికిస్తూ వచ్చాడు. నిజమైన ఫాస్ట్ బౌలర్‌కు మారుపేరుగా నిలిచిన షోయబ్ 2003 వన్డే వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌లో అయితే సచిన్‌కు సంధించిన బంతిని గంటకు 151 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. కంటికి కనిపించనంత వేగంతో వచ్చిన ఆ బంతిని సచిన్ మెరుపువేగంతో స్పందించి అప్పర్ కట్ సిక్స్‌గా మలిచి షోయబ్‌కు చుక్కలు చూపించాడు. 

వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీల చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన ఆ బంతిని, దాన్ని సిక్సర్‌గా మలచడంలో సచిన్ చూపిన లాఘవాన్ని ఈనాటికి క్రికెట్ ప్రపంచం మర్చిపోవడం లేదు. ఎప్పుడు బంతి విసిరాడో, ఎప్పుడు సచిన్ దాన్ని చితకబాదాడో తెలీని విధంగా ఆ బంతి బౌండరీ లైన్ దాటిపోయి వందకోట్లమంది భారతీయులను మాత్రమే కాకుండ క్రికెట్ క్రీడాభిమానులందరినీ పరవశింపచేసింది. అదే ఓవర్‌లో మరో రెండు బంతులను సచిన్ ఫోర్లుగా మలచడంతో పాక్ కెప్టెన్ తన తురుపు ముక్క అయిన షోయబ్‌ను బౌలింగ్ నుంచి తాత్కాలికంగా తప్పించాడంటే సచిన్ ప్రతాపం పాక్ జట్టుపై వేసిన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆరోజు తనకు జరిగిన పరాభవాన్ని 17 ఏళ్ల తర్వాత షోయబ్ గుర్తు చేసుకుంటూ సచిన్ గొప్పతనాన్ని కొనియాడటం ఒక గొప్ప బౌలర్ మరో గొప్ప బ్యాట్స్‌మన్‌కి ఇచ్చిన అరుదైన గౌరవంగానే చెప్పవచ్చు


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle