newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సంజూ శాంసన్, స్మిత్ ఉతుకుడుతో చిన్నబోయిన సీఎస్కే.. ఆర్ఆర్‌కు శుభారంభం

23-09-202023-09-2020 08:53:13 IST
Updated On 23-09-2020 09:05:51 ISTUpdated On 23-09-20202020-09-23T03:23:13.815Z23-09-2020 2020-09-23T03:23:10.966Z - 2020-09-23T03:35:51.364Z - 23-09-2020

 సంజూ శాంసన్, స్మిత్ ఉతుకుడుతో చిన్నబోయిన సీఎస్కే.. ఆర్ఆర్‌కు శుభారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజస్తాన్ రాయల్స్ డేరింగ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ ఒకే ఒక్కడిలా చేసిన వీర విహారం ముందు చెన్నయ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ బలం చిన్నబోయింది. 217 పరుగుల టార్కెట్ ఛేదనలో చివరిదాకా పోరాడిన సీఎస్కే జట్టు చివరివరకు పోరాడి తలవంచింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా డుప్లెసిస్‌(72; 37 బంతుల్లో 1 ఫోర్‌ 7 సిక్సర్లు), ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌; 17 బంతుల్లో 3 సిక్సర్లు)లు అలరించారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే, చివర్లో ధోని బ్యాట్‌కు పనిచెప్పాడు. కాగా, అప్పటికే నష్టం జరిగిపోవడంతో సీఎస్‌కే ఓటమి తప్పలేదు. కాగా, టామ్‌ కరాన్‌ వేసిన చివరి ఓవర్‌లో ధోని హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. 

రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఐపీఎల్‌-13 సీజన్‌ 3వ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పోరాడి ఓడింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మురళీ విజయ్‌-వాట్సన్‌లు దూకుడుగా ఆడారు. వాట్సన్‌ నాలుగు సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఇక విజయ్‌ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కాగా, వీరి ఇన్నింగ్స్‌కు 56 పరుగుల వద్ద తెరపడింది.  వాట్సన్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కాసేపటికి విజయ్‌ ఔటయ్యాడు. 

ఆపై సామ్‌ కరాన్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. గైక్వాడ్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది. తొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి సామ్‌ కరాన్‌ స్టంపౌట్‌ అవ్వగా, ఆ తర్వాత బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ అదే తరహాలో నిష్క్రమించాడు. దాంతో సీఎస్‌కే 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు మురళీ విజయ్‌(21), షేన్‌  వాట్సన్‌(33)లు ఔటయ్యారు. సీఎస్‌కే ఆరంభం బాగున్నా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో చెన్నై పరుగుల వేటలో వెనుకబడింది. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాతియా మూడు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరాన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు సీఎస్కే జట్టు బౌలింగ్‌ను తునాతునకలు చేసి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  మరిపించాడు. సీఎస్‌కే బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) ఔటైన తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచింది. 

ప్రధానంగా టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఎలా ఉండాలో చూపిస్తూ ఎంఎస్‌ ధోని బ్రెయిన్‌కు శాంసన్ పదును పెట్టాడు. రవీంద్ర జడేజాను రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత పీయూష్‌ చావ్లాను బౌలింగ్‌కు దింపగా, అతన్ని కూడా ఉతికి ఆరేశాడు. 32 బంతుల్లో 1 ఫోర్‌,. 9 సిక్స్‌లతో 74 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిశాడు. ఆర్చర్‌ 8 బంతుల్లో 4 సిక్స్‌లతో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌లు తలో వికెట్‌ తీశారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle