newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షోయబ్ సైక్లింగ్.. కరోనా వేళ బెస్ట్ వర్కవుట్

13-04-202013-04-2020 11:51:55 IST
Updated On 13-04-2020 12:48:16 ISTUpdated On 13-04-20202020-04-13T06:21:55.777Z13-04-2020 2020-04-13T06:21:33.654Z - 2020-04-13T07:18:16.222Z - 13-04-2020

షోయబ్ సైక్లింగ్.. కరోనా వేళ బెస్ట్ వర్కవుట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్తాన్ లెజెండ‌రీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఈమధ్య బాగా వార్తల్లోకి వచ్చాడు. కరోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంటి నుంచి బ‌య‌ట‌కువ‌చ్చాడు. వేకువ జామునే షోయ‌బ్ స్లైక్లింగ్ చేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చాడు. నా అంద‌మైన ఇస్లామాబాద్ సిటీ. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో సైక్లింగ్ చేస్తున్నా. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల‌పై బెస్ట్ వ‌ర్క‌వుట్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. షోయ‌బ్ సైక్లింగ్ చేస్తుండగా..అత‌ని స్నేహితుడు సోయ‌బ్ ను ఫాలో అవుతూ వీడియో తీశాడు. ఈ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

క్వారంటైన్ స‌మ‌యంలో క్రికెట్ అభిమానుల‌తో ఇటీవ‌లే కొన్ని విష‌యాలు షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో ఇదివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ లు, ప్ర‌స్తుతం క్రికెట్ లో ఉన్న స‌మస్య‌లతోపాటు క‌రోనా వైర‌స్ సంక్షోభం గురించి కూడా షేర్ చేశాడు. ఇంతకుముందు కరోనా బాధితులకు సాయం చేసేందుకు టీవీల కోసం మ్యాచ్ ఆడదామని, అలా వచ్చిన డబ్బుల్ని వాడదామని సలహా ఇచ్చాడు,. దీనిపై కపిల్ దేవ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు క్రికెట్ మ్యాచ్ లు ఆడాల్సిన అవసరం లేదు. అసలు బయటకు వచ్చి ఆడే పరిస్థితి ఎక్కడ వుందని షోయబ్ కామెంట్లకు స్టాంగ్ రిప్లై ఇచ్చాడు కపిల్ దేవ్. 

తరచూ భారత్ లో పర్యటిస్తూ భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడాలని, ఇరుదేశాలమధ్య సోదర సంబంధాలు తిరిగి ఏర్పడాలని పదే పదే ప్రకటిస్తూ ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్ అక్తర్ తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ను వేడుకున్నంత పని చేశాడు. తమ దేశంలో కరోనా వైరస్‌ని నియంత్రించడానికి భారత్ సాయం చేయాలంటూ అక్తర్ విన్నవించిన సంగతి తెలిసిందే. 

దయచేసి పాక్‌ను ఆదుకోండి.. భారత్‌ను అభ్యర్థించిన అక్తర్.. మిశ్రమ స్పందనలు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle