newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

షమీ ‘ఇంగ్లీష్’కి హోరెత్తిన మైదానం

29-01-201929-01-2019 18:08:31 IST
2019-01-29T12:38:31.700Z29-01-2019 2019-01-29T12:38:27.798Z - - 21-08-2019

షమీ ‘ఇంగ్లీష్’కి హోరెత్తిన మైదానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి ఇంగ్లీష్ రాదు. అతను మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి హిందీలోనే సమాధానమిస్తాడు. అలాగే అవార్డు అందుకున్నప్పుడు కూడా హిందీలోనే మాట్లాడడమో లేక ట్రాన్స్‌లేటర్‌గా తోటి క్రికెటర్‌ను తెచ్చుకుంటాడు. కానీ ఫస్ట్ టైమ్ షమీ అందుకు భిన్నంగా ఇంగ్లీష్ మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కామెంటేటర్ ఆంగ్లంలో అడిగిన ప్రశ్నను అర్థం చేసుకుని... ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇచ్చాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. ఈ సంఘటన కివీస్‌తో మూడో మ్యాచ్ గెలిచిన అనంతరం అవార్డ్ కార్యక్రమంలో చోటు చేసుకుంది.

మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన మహ్మద్‌ షమీ(3/41)కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది. ఈ అవార్డ్‌ని అందుకునేటప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడక తప్పదు కాబట్టి... ట్రాన్స్‌లేటర్‌గా విరాట్ కోహ్లీని తోడుగా తీసుకెళ్ళాడు. షమీకి అవార్డ్ ఇచ్చిన అనంతరం కామెంటేటర్ అతనికి ఇంగ్లీష్‌లో ఓ ప్రశ్న సంధించాడు. ఇందుకు అతను హిందీలో సమాధానం చెప్పి... కోహ్లీ చేత అనువదిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ... షమీ అనూహ్యంగా ఇంగ్లీష్‌లో మాట్లాడి చమత్కరించాడు. అక్కడక్కడ కాస్త తడబడినప్పటికీ... కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు మాత్రం సూటిగానే సమాధానం చెప్పాడు. అతని ఆంగ్లంతో ముగ్దుడైన కామెంటేటర్... ‘షమీ యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా’ అని హిందీలో కితాబిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. స్టేడియంలో ఉన్న జనాలు కేకలు వేస్తూ హోరెత్తించేశారు.

ఇంతకీ ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే... ‘‘న్యూజిలాండ్‌లో వీస్తున్న ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం ఎలా ఉంది’’ అని కామెంటేటర్ ప్రశ్నించాడు. అందుకు షమీ ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తూ... ‘‘నిజానికి ఎదురుగాలుల్లో బౌలింగ్‌ చేయడం కష్టమే. కానీ మరీ అంత కష్టం కూడా కాదు... సాధ్యమయ్యేదే! మరో ఎండ్‌ నుంచి భువనేశ్వర్‌ సాయం అందించాడు. సరైన ప్రదేశాల్లో బంతులను సంధించడమే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు. షమీ తొలిసారి ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడంతో... ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle