newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్‌...టీమిండియా ఎంపిక.. బుమ్రా, ధావన్ రీ ఎంట్రీ

24-12-201924-12-2019 08:03:37 IST
2019-12-24T02:33:37.177Z24-12-2019 2019-12-24T02:33:22.218Z - - 15-08-2020

శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్‌...టీమిండియా ఎంపిక.. బుమ్రా, ధావన్ రీ ఎంట్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా 2019 క్యాలెండరు ఇయర్ ను ఘనంగా ముగించింది. 2020 సంవత్సరం జనవరిలో టీమిండియా స్వదేశంలో మొదట టీ20 సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జనవరి 5 నుండి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా తొలి టీ20 జరగనుంది.

రెండో టీ20 జనవరి 7 ఇండోర్ వేదికగా జరగనుంది. మూడో టీ20 జనవరి 10 పూణే వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. టీ20 సిరీస్ కు సెలెక్టర్లు వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న రోహిత్ శర్మ, షమీలకు విశ్రాంతి నిచ్చారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, ధావన్ లను తిరిగి ఎంపిక చేశారు. 

టీ20 సిరీస్ కుటీమిండియా జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివమ్ దుబే, చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ 

జనవరి 10న శ్రీలంకతో టీ20 సిరీస్ ముగియగానే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 14న టీమిండియా-ఆసీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ వన్డేకు వేదికగా ముంబై నిలవనుంది. జనవరి 17 రాజ్ కోట్ వేదికగా రెండో వన్డే ఈ రెండు జట్లు ఆడనున్నాయి. సిరీస్ లో చివరిదైన చివరి వన్డే జనవరి 19న బెంగళూరులో జరగనుంది.  ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్ కు కూడా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. వన్డేల కోసం రోహిత్, షమీ తిరిగి జట్టులో చేరనున్నారు. 

వన్డే సిరీస్ కు టీమిండియా జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్),  ధావన్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, శివమ్ దుబే, చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ, బుమ్రా, షమీ 

జనవరి 19న ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్ ముగియగానే టీమిండియా విదేశీ పర్యటనలో భాగంగా కివీస్ లో పర్యటించనుంది. జనవరి 24న టీమిండియా జట్టు కివీస్ వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను టీమిండియా ఆడనుంది. కివీస్ టూర్ కోసం జట్టును జనవరి రెండో వారంలో ఎంపిక చేయనున్నారు. 

 

 

ధోనీకి కరోనా నెగిటివ్... కోలుకున్న కరుణ్ నాయర్

ధోనీకి కరోనా నెగిటివ్... కోలుకున్న కరుణ్ నాయర్

   15 hours ago


నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్

నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్

   17 hours ago


ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా  బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

   13-08-2020


వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

   12-08-2020


కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

   12-08-2020


బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

   12-08-2020


అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

   11-08-2020


ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   11-08-2020


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   11-08-2020


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   11-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle