వెంటిలేటర్ పై మాజీ క్రికెటర్, యూపీ మంత్రి చేతన్ చౌహాన్
15-08-202015-08-2020 18:20:04 IST
2020-08-15T12:50:04.367Z15-08-2020 2020-08-15T12:49:10.975Z - - 12-04-2021

దేశంలో వీఐపీలు, మంత్రులు, క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. యూపీలో మహిళా మంత్రి కమల్ రాణి వరుణ్ కరోనా బారిన పడి మరణించడం విషాదం నింపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో చేతన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాత్రి నుంచి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున పలు టెస్ట్‌లు, వన్డేల్లో క్రికెట్ ఆడిన చేతన్ చౌహాన్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. హోంమంత్రి అమిత్ షా కరోనానుంచి కోలుకోగా, నిత్యం ప్రజలకు కరోనా లెక్కలు చెప్పే కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారిన పడ్డారు.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
8 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
18 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
17 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా