newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విషమ పరిస్థితుల్లో సచిన్ సలహానే కాపాడింది.. కోహ్లీ వెల్లడి

27-07-202027-07-2020 06:33:45 IST
Updated On 27-07-2020 07:18:26 ISTUpdated On 27-07-20202020-07-27T01:03:45.741Z27-07-2020 2020-07-27T01:03:42.915Z - 2020-07-27T01:48:26.352Z - 27-07-2020

విషమ పరిస్థితుల్లో సచిన్ సలహానే కాపాడింది.. కోహ్లీ వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్కటోర్నీ.. ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మన్ కెరీర్‌నే ప్రమాదంలో పడవేసింది. 2014 ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయిదు టెస్టుల్లో 10 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 134 మాత్రమే. అది కూడా 13.40 సగటు. ఇంత నాసిరకం ఆట ప్రదర్శనతో పూర్తిగా కుంగిపోయిన ఆ దిగ్గజ ఆటగాడు మరో దిగ్గజ ఆటగాడి సలహాతో తేరుకుని మరో విదేశీ టోర్నీలో పరుగుల వర్షం కురిపించాడు. 

ఇంగ్లండ్ టూర్‌లో చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను నమోదు చేసిన తాను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. హిప్‌ అలైన్‌ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్‌ టూర్‌లో బ్యాటింగ్‌ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు. 

‘‘ఇంగ్లండ్‌ టూర్‌లో హిప్‌ పొజిషన్‌ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. 

ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్‌ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్‌ చేస్తూ బ్యాటింగ్‌ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్‌ టూర్‌లో నేను ఈ టెక్నిక్‌ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత ముంబైలో సచిన్‌ పాజీని కలిశాను. ఫార్వర్డ్‌ ప్రెస్‌(బలంగా నిల్చుని కాలు ముందు చాచడం) ద్వారా ఫాస్ట్‌ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్‌ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్‌ టూర్‌లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 

కాగా 2014 ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 13.40 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి కెరీర్‌లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్‌ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్‌ మార్చుకుని ఆసీస్‌ టూర్‌(2014-15)లో 692 పరుగులతో రాణించి విరాట్ కోహ్లీ సత్తా చాటాడు.   

ఇంగ్లండ్‌లో అయిదు టెస్టుల టోర్నీలో మొత్తం పది ఇన్నింగ్సులలో వరుసగా 1, 8, 25, 0, 38, 28, 0, 7, 6, 20 పరుగులతో ఘోరంగా నిరాశ పర్చిన కోహ్లీ జట్టు దారుణ పరాజయానికి మూలకారణమై నిలిచాడు. స్వదేశం తిరిగివచ్చాక సచిన్‌ టెండూల్కర్‌ని సంప్రదించి సాంకేతికంగా తన ఆట తీరును సర్దుబాటు చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నీలో 692 పరుగులతో రాణించాడు.  ఆ తర్వాత కోహ్లీకి తిరుగులేకుండా పోయింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle