newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విరుష్క అభిమానుల్ని కంగారుపెట్టించిన ఫేక్ న్యూస్

08-06-202008-06-2020 14:35:58 IST
Updated On 08-06-2020 15:01:06 ISTUpdated On 08-06-20202020-06-08T09:05:58.567Z08-06-2020 2020-06-08T09:05:31.166Z - 2020-06-08T09:31:06.320Z - 08-06-2020

విరుష్క అభిమానుల్ని కంగారుపెట్టించిన ఫేక్ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఈ జంట బాగా ఫ్యామస్. కాస్త టైం దొరికిందంటే చాలు ఈ జంట గతంలో విదేశాలకు చెక్కేసేవారు. కరోన లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ జంటకు సంబంధించిన ఏ వార్త అయినా వెంటనే వైరల్ కావడం ఖాయం.

తాజాగా ఓల్డ్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది. ఈ జంట త్వరలో విడిపోనున్నారని తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు సినీ క్రీడాభిమానులు. విరుష్క జోడీ విడాకులు తీసుకోబోతుందంటూ ట్విట్టర్‌లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు ఏమైంది? ఎందుకు విడిపోతున్నారంటూ అభిమానులు మెసేజ్ లు, ట్వీట్లు పెట్టారు. 

ఆ తర్వాత అది ఫేక్ హ్యాష్ ట్యాగ్ అని, విరుష్క జోడీ విడాకులు తీసుకోవడం అనేది అబద్దం అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు జనం. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ పలు చర్చలకు తెరలేపుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్ళు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులను కాసేపు టెన్షన్ పెట్టారు. #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్‌ అంశం నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతూ అలజడి సృష్టించింది. ఈ న్యూస్‌పై రకరకాల మీమ్స్ పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో ఇది కొందరు ఆకతాయిలు సృష్టించిన హ్యాష్ ట్యాగ్ తప్ప అందులో నిజం లేదని స్పష్టత రావడంతో కూల్ అయ్యారు. 2016లో ఓ వెబ్‌సైట్‌ రాసిన ఫేక్ న్యూస్‌ని చూసి కొందరు నెటిజన్లు.. అసలు విషయం తెలుసుకోకుండా ఈ హ్యాష్‌ట్యాగ్‌ని మళ్ళీ ప్రచారం చేశారని నింపాదిగా తెలిసింది. అందుకే మనోళ్లు అంటుంటారు. నిజం నింపాదిగా వుంటే అబద్దం అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందని. ఇలాంటి ఫేక్ న్యూస్ చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది కదూ. 

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   42 minutes ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle