newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

విరాట్ దే అగ్రస్థానం...

04-12-201904-12-2019 17:31:13 IST
2019-12-04T12:01:13.634Z04-12-2019 2019-12-04T12:01:08.678Z - - 24-01-2020

విరాట్ దే అగ్రస్థానం...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రికార్డుల రారాజు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఘోరంగా విపలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు.

ఇదే క్రమంలో దక్షిణాప్రికాపై డబుల్‌ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్‌ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్‌ స్మిత్‌.. ఆ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.

అంతేకాకుండా అప్పటివరకు నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లిని పక్కకు నెట్టి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా పాక్‌ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 

టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌ (పాయింట్లు)....

విరాట్ కోహ్లీ(928)

స్టీవ్‌స్మిత్ (923),

కేన్ విలియమ్సన్ (877),

చతేశ్వర్ పుజారా (791),

డేవిడ్ వార్నర్ (764),

అజింక్య రహానె (759),

జో రూట్ (752),

లబుషేన్ (731),

హెన్రీ నికోలస్ (726),

దిముత్ కరుణరత్నె (723)

బౌలింగ్ ర్యాంకింగ్స్‌ (పాయింట్లు)...

ప్యాట్‌ కమిన్స్‌(900)

కగిసో రబడా(839)

జాసన్ హోల్డర్(830)

నీల్ వాగ్నెర్(814)

 జస్ప్రిత్‌ బుమ్రా(794)

ఫిలాండర్(783)

జేమ్స్ అండర్ సన్(782)

హెజిల్ వుడ్ (776)

రవిచంద్రన్‌ అశ్విన్‌(772)

మహ్మద్ షమి(771)

ఆల్ రౌండర్ల జాబితా(పాయింట్లు)...

జేసన్ హోల్డర్ (473)

రవీంద్ర జడేజా(406)

బెన్‌స్టోక్స్(381)

ఫిలాండర్(315)

రవిచంద్రన్ అశ్విన్(305)

టీమ్ టెస్టు ర్యాంకింగ్స్‌(పాయింట్లు)...

టీమిండియా (120)

న్యూజిలాండ్ (109),

ఇంగ్లాండ్ (104),

దక్షిణాఫ్రికా (102),

ఆస్ట్రేలియా (102)

లు టాప్-5లో ఉన్నాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle