newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

08-12-201908-12-2019 16:10:39 IST
2019-12-08T10:40:39.452Z08-12-2019 2019-12-08T10:40:25.348Z - - 24-01-2020

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా స్టార్ ప్లేయర్లు భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లను ఓ రికార్డు ఊరిస్తోంది. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉండగా మరో 3 పరుగులు చేస్తే రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఆ రికార్డును అందుకుంటాడు. మరీ రోహిత్ ఆ రికార్డును కాపాడుకుంటాడా...? లేదా విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడో? లేదో... చూడాలి.

ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శతక సమాన ఇన్నింగ్స్ ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మంచి జోరుమీదున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 6ఫోర్లు, 6 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ 94 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక ఆదివారం రాత్రి తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రెండు అరుదైన టీ20 రికార్డ్స్‌ని అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే అత్యధిక హాఫ్ సెంచరీలు (23) నమోదు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. మరో నాలుగు పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం భారత ఓపెనర్ రోహిత్ శర్మ 102 టీ20ల్లో 2,547 పరుగులతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 73 టీ20 మ్యాచ్‌ల్లోనే 2,544 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో.. తిరువనంతపురం టీ20లో ఈ నెం.1 రికార్డ్‌ని విరాట్ కోహ్లీ అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. తొలి టీ20లో 8 పరుగులకే ఔటైన రోహిత్ శర్మ కూడా రెండో టీ20లో చెలరేగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీంతో.. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు నెం.1 స్థానం కోసం పోటీ మొదలైంది.

విరాట్ కోహ్లీ మరో వరల్డ్ టీ20 రికార్డ్‌కి కూడా 25 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్ గడ్డపై అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ 975 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 25 పరుగులు చేస్తే..? స్వదేశంలో 1,000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. అంతేకాకుండా.. భారత్ గడ్డపై ఈ ఘనత సాధించి తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత సాధించనున్నాడు.

ఇదిలా ఉండగా  ఉప్పల్ టీ20లో ఏకంగా 416 పరుగులు నమోదవగా.. 27 సిక్సర్లు, 23 ఫోర్లతో స్టేడియం హోరెత్తింది. కానీ.. తిరువనంతపురం టీ20లో ఈ తరహాలో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా చెలరేగే అవకాశాలు కనిపించడం లేదు. పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుండటంతో  బ్యాట్స్‌మెన్ రక్షణాత్మక ధోరణిలోనే బ్యాటింగ్ చేసే సూచనలు ఉన్నాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle