newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

విరాట్ కోహ్లీ నయా అవతార్

11-09-201911-09-2019 15:04:39 IST
Updated On 11-09-2019 15:04:37 ISTUpdated On 11-09-20192019-09-11T09:34:39.378Z11-09-2019 2019-09-11T09:29:58.332Z - 2019-09-11T09:34:37.345Z - 11-09-2019

విరాట్ కోహ్లీ నయా అవతార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కొత్త అవతారం ఎత్తాడు. హెయిర్ స్టయిల్ మార్చుకోవడమే కాదు.. కొత్త డ్రెస్ తో అందరినీ మెప్పిస్తున్నాడు. తాజాగా కోహ్లీ ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ కొత్త అవతారం అందరినీ ఆశ్చర్యపరుస్తోందనడంలో సందేహం లేదు.జట్టుకొంచెం కత్తిరించి షేర్వాణీతో హల్ చల్ చేశాడు.

వెస్టిండిస్ పర్యటన అనంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి టూరేశాడు. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంచి కాలక్షేపం దొరికింది. అందులో భాగంగా విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అంతకుముందు మంగళవారం కూల్ డ్రెస్సులతో కనిపించాడు కోహ్లీ. ఆ తర్వాత దిగిన ఫోటో ఒకటి రచ్చరేపుతోంది. ఓ బీచ్ దగ్గర తన భార్యతో దిగిన ఫోటోలో వీరిద్దరి స్టయిల్ పై కామెంట్లు పడుతున్నాయి. అందులో అనుష్క శర్మ బికినీని ధరించగా... విరాట్ కోహ్లీ అర్ధనగ్నంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు కోహ్లీ అనుష్క ఒడిలో సేదతీరుతున్నాడు. తన నెచ్చెలి చెంతనే ఉండగా.. ఆమె ఒడిలో మైరచిపోతున్నాడు కోహ్లీ.  

https://www.photojoiner.net/image/9uRtS4DD

Hilarious: Anushka Sharma With Virat Kohli in His Beach-side Pic Hilarious: Anushka Sharma With Virat Kohli in His Beach-side Pic


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle