newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

10-07-202010-07-2020 14:02:03 IST
2020-07-10T08:32:03.220Z10-07-2020 2020-07-10T08:30:55.383Z - - 04-08-2020

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ నిప్పులు చెరిగాడు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన హోల్డర్ 42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడంతో.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో కెప్టెన్ బెన్‌స్టోక్స్ 97 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌కి వర్షం పదే పదే ఆటంకం కలిగించడంతో నిన్న కేవలం 17.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దాంతో.. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ స్కోరు 35/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్.. వరుసగా వికెట్లు చేజార్చుకుని 67.3 ఓవర్లలోనే ఆలౌటైంది.

హోల్డర్‌ (6/42)కి తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్ (4/62) కూడా చెలరేగడంతో.. ఆతిథ్య ఇంగ్లాండ్ ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. మధ్యలో బెన్‌స్టోక్స్ పోరాడినా.. అతనికి సహకరించేవారు టీమ్‌లో కరవయ్యారు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (35: 47 బంతుల్లో 6x4) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

కరోనా వైరస్ కారణంగా 117 రోజులు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఈ టెస్టుతో మొదలైంది. పూర్తిగా బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తుండగా.. సక్సెస్ అయితే మిగిలిన క్రికెట్ దేశాలు కూడా సిరీస్‌లు ప్రారంభించే అవకాశం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle