newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వార్నర్ కే మళ్లీ పట్టం కట్టిన సన్‌ రైజర్స్‌

28-02-202028-02-2020 09:11:28 IST
2020-02-28T03:41:28.183Z28-02-2020 2020-02-28T03:41:01.772Z - - 17-04-2021

వార్నర్ కే  మళ్లీ  పట్టం కట్టిన సన్‌ రైజర్స్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ మార్చి 29న ఆరంభం కానుంది. ఏప్రిల్‌ 1న సన్‌ రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌ ముంగిట కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విలియమ్సన్ ను తప్పించింది. తిరిగి రెండేళ్ల తరువాత ఆ బాధ్యతలను ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అప్పగించింది. దీంతో కివీస్ ఆటగాడు విలియమ్సన్ ఇక బ్యాట్స్‌మెన్‌గానే కొనసాగనున్నాడు.

2014 చివర్లో జరిగిన వేలంలో డేవిడ్‌ వార్నర్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్‌. 2015 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అప్పగించింది. వార్నర్‌ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌ 2016లో మొదటి సారి ఐపీఎల్‌ టైటిల్‌ ను ముద్దాడింది. అయితే 2018లో బాల్‌ టాంపరింగ్‌ కారణంగా.. వార్నర్‌ పై ఏడాది నిషేదం పడింది. దీంతో వార్నర్‌ వారసుడిగా న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌విలియమ్‌సన్‌ను ఎంపికచేశారు.

2018, 2019 సీజన్లలో కేన్‌ సారథ్యంలోనే హైదరాబాద్‌ బరిలోకి దిగింది. హాట్‌ ఫేవరేట్‌గానే బరిలోకి దిగినా.. టైటిల్‌ను గెలవలేకపోయింది. నిషేదం ముగిసిన తరువాత 2019లో వార్నర్‌ అందుబాటులోకి వచ్చినా.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిరాకరించింది. బాల్ టాంపరింగ్‌తో నిషేధానికి గురై ఉండటంతో.. బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో ఫ్రాంఛైజీ వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా.. మళ్లీ ఈ ఆస్ట్రేలియన్‌ ఆటగాడిపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. 2019 సీజన్‌లో ఒక ఆటగాడిగా కొనసాగుతూ తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. మొత్తం 12  మ్యాచుల్లో 692 పరుగులు సాధించి లీగ్‌ టాపర్‌గా నిలవడం విశేషం. అందులో ఒక శతకం, 8 అర్థసెంచరీలు ఉన్నాయి.

ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ లో వార్నర్ వీడియో ని పోస్ట్ చేసింది. వార్నర్‌ స్పందిస్తూ..' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి తనను కెప్టెన్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా.. 2018 ఐపీఎల్‌ సీజన్‌కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్‌సన్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.

మరోసారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడుపుతున్నా.. అందుకు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నన్ను కెప్టెన్‌ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. తనకు ఇంతకాలం మద్దతుగా ఉన్న సన్‌రైజర్స్‌ అభిమానులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ తెలిపాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకూ 126 మ్యాచ్‌లాడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. 142.39 స్టైక్‌రేట్‌తో 4,706 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలో మరోసారి టైటిల్ అందుకోవాలని అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కోరుకొంటోంది..

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle