newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

వారి కోసం రాజస్థాన్ ఆరాటం...

07-12-201907-12-2019 13:58:55 IST
2019-12-07T08:28:55.279Z07-12-2019 2019-12-07T08:17:04.347Z - - 11-08-2020

వారి కోసం రాజస్థాన్ ఆరాటం...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో విజేతగా నిలిచి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. అరగ్రేటంలో కప్పు కొట్టిన రాజస్థాన్ ఆ తరువాత మరో సారి కప్పును ముద్దాడలేదు. స్టార్ ప్లేయర్లను కాదని యువ ఆటగాళ్లతోనే రాణిస్తున్న రాజస్థాన్  2013, 15,18లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ సారి ఎలాగైన కప్పు కొట్టాలని కృత నిశ్చయంతో ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఆ జట్టు సీనియర్ ప్లేయర్  అజింక్యా రహానే తో సహా 11 మందిని రిలీజ్ చేసిన రాయల్స్.. జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారించింది.

రహానేను ఢిల్లీకి బదిలీ చేసిన రాయల్స్ మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా, అంకిత్ రాజ్‌పుత్‌లను తీసుకుంది. ఇక ఆ జట్టు కొత్త కోచ్ అండ్రూ మెక్ డొనాల్డ్స్ మార్గదర్శకంలో వేలంలో మెరికల్ లాంటి యువ ఆటగాళ్లను దక్కించుకోవాలని బావిస్తోంది. ప్రస్తుతం రాయల్స్ ఖాతాలో రూ.28.90 కోట్ల బడ్జెట్ ఉంది. అయితే జట్టు పరిస్థితులను బట్టి ఈసారి ఓ ముగ్గురు ప్లేయర్లను మాత్రం టీమ్‌లోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ బావిస్తోంది. 

ఓపెనర్ గా రహానే రాజస్థాన్ రాయల్స్ కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. రహానే ను ఢిల్లీకి బదిలి చేయడంతో మరో ఓపెనర్ కోసం రాజస్థాన్ వెతుకుతోంది. మన్నన్ వొహ్రా రూపంలో ఓపెనర్ ఉన్నప్పటికి సీనియర్ ప్లేయర్ అయితే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రస్తుత వేలంలో ఎక్కువగా దేశవాళీ సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో ఉన్న వారందరిలో ఊతప్ప మెరుగ్గా కన్పిస్తున్నాడు.

ఈక్రమంలో ఓపెనర్‌గా ఊతప్ప బాగా ఉపకరిస్తాడని టీమ్ భావిస్తోంది. బట్లర్‌తో కలిసి దూకుడైన బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఊతప్పకు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. 177 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్ ఖాతాలో 4,411 పరుగులు ఉన్నాయి. 28.83 సగటుతో పరుగులు సాధించాడు.

బ్యాటింగ్ లో బాగానే ఉన్న రాయల్స్ కు బౌలింగ్ లో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. జోఫ్రా అర్చర్ రూపంలో ఓ అస్త్రం మాత్రమే ఉంది. అర్చర్ కు తోడుగా దేశవాలీ పేసర్లు అంకిత్ రాజ్‌పుత్, వరుణ్ ఆరోన్‌ ఉన్నా వారు ధారాళంగా పరుగులు ఇస్తుండడంతో ఓ నాణ్యమైన యువ పేసర్ ను తీసుకోవాలని చూస్తోంది. అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన ఇషాన్ పోరెల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల దేవధర్ ట్రోఫీలో సత్తాచాటిన పోరెల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ టోర్నీలో తను 9 వికెట్లు తీసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఫైనల్లో ఐదు వికెట్ల హౌల్ సాధించి సత్తాచాటాడు. 

సిసలైన పేసర్‌గా పేరుతెచ్చుకున్న నాథన్ కౌల్టర్‌నైల్ గత రెండు సీజన్లలో ఐపీఎల్ లో అంతగా కన్పించలేదు. గత సీజన్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన తను ఈసారి వేలంలోకి వచ్చాడు. ఓవర్‌సీస్ ప్లేయర్లలో మంచి ఆటగాడైన కౌల్టర్‌నైల్‌ను దక్కించుకునేందుకు రాజస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మంచి వేగంతో బౌలింగ్ చేయడంతోపాటు డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసే నైపుణ్యాలు ఇతని సొంతం. చాలా తక్కువ ధరకే తను లభించే అవకాశముండడంతో రాయల్స్ ఈ ఆస్ట్రేలియా ప్లేయర్‌ను సొంతం చేసుకునే అవకాశలు పుష్కలం. ఓవరాల్‌గా 108 మ్యాచ్‌లాడిన నాథన్ 130 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లకు ప్లేయింగ్ లెవన్‌లో కచ్చితంగా చోటు ఉంటుంది కాబట్టి మరే ఓవర్‌సీస్ బ్యాట్స్‌మన్‌ను రాయల్స్ తీసుకోదు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle