వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్
12-08-202012-08-2020 09:55:58 IST
Updated On 12-08-2020 10:30:12 ISTUpdated On 12-08-20202020-08-12T04:25:58.891Z12-08-2020 2020-08-12T04:25:52.181Z - 2020-08-12T05:00:12.500Z - 12-08-2020

లంక ప్రీమియర్ లీగ్‌కి తొలి సీజన్లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ తరహాలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)ని తెరపైకి తీసుకురాగా.. ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ ఈ టోర్నీని నిర్వహించాలని షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆ దేశంలో 14 రోజుల క్వారంటైన్ ప్రొటోకాల్ నిబంధన ఈ టోర్నీని వాయిదాపడేలా చేసింది. షెడ్యూల్ ప్రకారం మరో 17 రోజుల్లో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభంకావాల్సి ఉంది. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో పోటీపడనుండగా.. వివిధ దేశాలకి చెందిన దాదాపు 70 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇందులో ఆడతారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ.. వీరిలో చాలా మంది మంగళవారానికి అక్కడికి చేరుకోలేకపోయారు. మరోవైపు ఆటగాళ్ల క్వారంటైన్ గడువుని వారానికి కుదించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని.. లంక క్రికెట్ బోర్డు కోరగా.. అందుకు గవర్నమెంట్ నిరాకరించింది. దాంతో.. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహించలేమని నిర్ధారణకి వచ్చిన బోర్డు.. లంక ప్రీమియర్ లీగ్‌ని నవంబరుకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ టోర్నీ ముగిసి తర్వాత నవంబరు 20 నుంచి డిసెంబరు 12 వరకూ లంక ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించేందుకు అవకాశాలున్నట్లు లంక బోర్డు తెలిపింది. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో.. ఐపీఎల్ 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి శ్రీలంక క్రికెటర్లు లసిత్ మలింగ, ఇసురు ఉదాన అందుబాటులో ఉండనున్నారు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
5 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
7 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
13 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా