newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

వర్షంతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఆటంకం

09-07-201909-07-2019 18:55:33 IST
2019-07-09T13:25:33.438Z09-07-2019 2019-07-09T13:25:26.111Z - - 19-10-2019

వర్షంతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఆటంకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకు పండగే. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్స్ లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

భారత్ జట్టులో లోకేశ్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఉండగా.. న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్ టేలర్‌, టామ్‌ లేథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌ వున్నారు. 

భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.  వర్షం కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భువనేశ్వర్‌ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేశారు.

ఎక్కువ తేమ ఉండటంతో కవర్లు కప్పాలని మైదానం సిబ్బందికి సూచించారు. అప్పుడప్పుడు పలకరించిన చిరుజల్లులు కాస్త ఉద్ధృతి పెంచాయి. కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఇంకా 23 బంతులే ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆట నిలిపివేయక తప్పలేదు. న్యూజిలాండ్‌ బ్యాట్స్ మెన్లు రాస్‌ టేలర్‌ (67; 85 బంతుల్లో 3×4, 1×6), టామ్‌ లేథమ్‌ (3; 4 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కివీస్ 211పరుగుల వద్ద వుండగా వర్షం మొదలయ్యింది. దీంతో ఆట ఆగిపోయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle