newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వరల్డ్ కప్ ఫేవరెట్ ఎవరో చెప్పేసిన అజ్జూ

15-05-201915-05-2019 13:37:56 IST
2019-05-15T08:07:56.583Z15-05-2019 2019-05-15T08:07:47.002Z - - 21-08-2019

వరల్డ్ కప్ ఫేవరెట్ ఎవరో చెప్పేసిన అజ్జూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ ముగిసింది. ఇక అందరి ఫోకస్ వరల్డ్ కప్ పైనే. త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. మే 30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ అజహరుద్దీన్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఐసీసీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచే సత్తా విరాట్‌ కోహ్లీ సేనకు ఉందని అజహరుద్దీన్‌ చెబుతున్నాడు. ఇంగ్లాండ్‌లో అద్భుతంగా బంతులు విసిరే బౌలర్లు మనకు ఉన్నారని వెల్లడించాడు. ప్రపంచకప్‌ ఫేవరెట్‌ భారత్‌ అని జోస్యం చెప్పాడు. 

‘మనకు మంచి అవకాశం ఉంది. మంచి జట్టుంది. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అక్కడి వికెట్లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది కలుగుతుందని చాలామంది అంటున్నారు. కానీ మన బౌలర్లూ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగలరు కదా. ప్రపంచ స్థాయి అత్యుత్తమ బౌలర్లు మనకున్నారు’ అని అజహరుద్దీన్ కామెంట్ చేశారు. ప్రపంచకప్‌లో టీమిండియా తర్వాత ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా అంటున్నాడు అజహరుద్దీన్. మైదానంలో ఏదైనా జరగవచ్చు. మన జట్టు శుభారంభం చేయాలి. కప్‌తో తిరిగిరావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle