newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరల్డ్ కప్ కి మరొక మెట్టు దిగువన భారత మహిళా జట్టు

05-03-202005-03-2020 15:16:06 IST
Updated On 05-03-2020 15:16:43 ISTUpdated On 05-03-20202020-03-05T09:46:06.481Z05-03-2020 2020-03-05T09:46:02.758Z - 2020-03-05T09:46:43.055Z - 05-03-2020

వరల్డ్ కప్ కి మరొక మెట్టు దిగువన భారత మహిళా జట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత మూడు దఫాలుగా తమను ఊరిస్తూ వస్తున్న టి20 ఫైనల్ లక్ష్యాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు అధిగమించడానికి సమయం ఆసన్నమైంది. మహిళల టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత వర్షం కారణంగా దాటింది. నేడు ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్ లో తలపడనుండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడం జరిగింది. రిజర్వ్‌ డే లేనందున పోటీ రద్దయితే భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది..

అయితే ప్రత్యర్థి అయిన ఇంగ్లండ్ మహిళల జట్టుతో మన గత అనుభవాన్ని చూస్తే కాస్త ఆందోళనకరంగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్‌  ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్‌ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత  రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా  వేచి చూడాలనుకున్నారు. 

లీగ్‌ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్‌ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్‌ మాత్రం ఫైనల్‌ చేరడంపై ఆశలు రేపుతోంది.  

అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్‌ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. 

ఇక హర్మన్‌ కౌర్‌ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్‌ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. 

లీగ్‌ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్‌ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. 

బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్‌ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్, లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలతో బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. 

తొలిసారి ఫైనల్‌ చేరాలన్న ఆకాంక్ష నేరవేరింది... ఆపై ట్రోఫీతో చరిత్ర సృష్టించాలన్న పట్టుదల కలగలిసిన వేళ ఆదివారం జరిగే మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్‌ సేన సిద్ధమైంది..అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle