newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

వరల్డ్ కప్పా ఇది వరుణుడి కప్పా..?

12-06-201912-06-2019 06:36:41 IST
Updated On 12-06-2019 07:23:30 ISTUpdated On 12-06-20192019-06-12T01:06:41.518Z11-06-2019 2019-06-11T17:22:00.039Z - 2019-06-12T01:53:30.350Z - 12-06-2019

వరల్డ్ కప్పా ఇది వరుణుడి కప్పా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరల్డ్ కప్పా ఇది వరుణుడి కప్పా అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దవగా తాజాగా జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌కూడా వర్షం కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరిగే భారత్, కివీస్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు క్రీడాభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మూడు వరుస విజయాలతో కివీస్, రెండు వరుస విజయాలతో భారత్ దూకుడు మీద ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ పైనే అందరి కళ్లూ ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్‌లో భారీ వర్షాలకు పలు మ్యాచ్‌లు రద్దువుతున్నాయి.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాబోయే రెండు రోజులు అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఒక వేళ గురువారం మధ్యాహ్నం వరకు వర్షం ఆగితే టీ20 మ్యాచ్‌కు మాత్రం అవకాశం ఉంటుందని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle