newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వన్డే ప్రపంచకప్‌కి అర్హత... సూపర్ లీగ్ గెలవాల్సిందే!

31-07-202031-07-2020 10:58:25 IST
2020-07-31T05:28:25.191Z31-07-2020 2020-07-31T05:28:17.871Z - - 07-08-2020

వన్డే ప్రపంచకప్‌కి అర్హత... సూపర్ లీగ్ గెలవాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ వేదికగా 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి అర్హత సాధించాలంటే.. తాజాగా ఐసీసీ ప్రారంభించిన సూపర్ లీగ్‌లో జట్లు సత్తాచాటాల్సిందే. వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు బరిలోకి దిగనుండగా.. ఆతిథ్య హోదాలో టీమిండియా‌కి డైరెక్ట్‌గా ఎంట్రీ లభిస్తుంది. మిగిలిన 9 స్థానాల కోసం సూపర్ లీగ్‌లో మూడేళ్లపాటు పోటీపడనున్న జట్లు.. సొంతగడ్డపై నాలుగు, విదేశీ గడ్డపై నాలుగు సిరీస్‌లు ఆడనున్నాయి. ఒక్కో సిరీస్‌లో మూడు వన్డేలు ఉండనున్నాయి. 

సూపర్ లీగ్‌‌లో భాగంగా ఐర్లాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుని.. బోణి కొట్టింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు పేలవంగా 172 పరుగులకే కుప్పకూలిపోయింది.  

అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్ (24), జానీ బెయిర్ స్టో (2) నిరాశపరిచినా.. శామ్ బిల్లింగ్స్ (67 నాటౌట్: 54 బంతుల్లో 11x4), ఇయాన్ మోర్గాన్ (36 నాటౌట్: 40 బంతుల్లో 4x4, 2x6) జోడీ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ టీమ్ లక్ష్యాన్ని 27.5 ఓవర్లలోనే 174/4తో ఛేదించింది. మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లీ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఇక రెండో వన్డే సౌథాంప్టన్ వేదికగానే ఆగస్టు 1న జరగనుంది.

ఆ జట్టులో కర్టీస్ క్యాంపెర్ 118 బంతుల్లో 59 నోటౌట్ తో ఆకట్టుకోగా.. ఆండీ మెక్‌బ్రైన్ 48 బంతుల్లో 40 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ (5/30) వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ని ఆరంభంలోనే ఒత్తిడిలోకి నెట్టగా.. మహ్మద్ (2/36), ఆదిల్ రషీద్ (26/1), టామ్ కుర్రాన్ (1/37) అతనికి సపోర్ట్‌గా నిలిచారు. సిమీ సింగ్ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా.. 44.4 ఓవర్లలోనే ఐర్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle