newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

18-05-202018-05-2020 10:56:35 IST
Updated On 18-05-2020 11:19:18 ISTUpdated On 18-05-20202020-05-18T05:26:35.264Z18-05-2020 2020-05-18T05:26:32.277Z - 2020-05-18T05:49:18.827Z - 18-05-2020

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ చరిత్ర‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సచిన్‌ వన్డేల్లోనూ తొలి డబుల్ సెంచరీ సాధించిన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2010లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ ఈ ఫీట్‌ను అందుకొని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచాడు. అయితే ఈ డబుల్ సెంచరీపై సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ అయిన స్టెయిన్ అంపైర్ భయపడటం వల్లనే సచిన్ డబుల్ సెంచరీ సాధించాడని ఆరోపించాడు. 

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిపిన చిట్ చాట్‌లో స్టెయిన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'గ్వాలియర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఆ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడ్డాడు. దాంతో సచిన్ 190 ప్లస్ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీడబ్ల్యూ చేశానని, కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. నాకు ఏమీ అర్థం కాక గౌల్డ్ వైపు చూశాను. అతని ముఖంలో ఏదో భయం కనపడింది. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు అంటూ అంపైర్‌ వైపు చూశా. 

Dale Steyn says umpire denied him Sachin Tendulkar's wicket in ...

కానీ అంపైర్ నిజంగానే భయంతో ఉన్నాడు. చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే మ్యాచ్ ముగిసిన తర్వాత నన్ను ఇక్కడినుంచి హోటల్‌కి వెళ్లనివ్వరంటూ అంపైర్ పేర్కొన్నాడని స్టెయిన్ దాదాపు పదేళ్ల తర్వాత ఆరోజు జరిగిన ఘటనను వివరించాడు.

ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 401 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. తరువాత ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 

అయితే స్టెయన్ నిర్దారణకు భిన్నంగా స్కోర్ కార్డ్ అసలు వాస్తవాన్ని చూపింది. ఆ మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ భారత క్రికెట్ దేవుడు సచిన్‌కి 31 బంతులు విసిరాడు. కానీ ఏ ఒక్క బంతికీ డేల్ ఎల్‌బీడబ్ల్యూ కోరుతూ అరచినట్లు స్కోర్ కార్డ్ చూపలేదు. పైగా సచిన్ 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్టెయిన్ అతడికి మూడు బంతులు విసిరితే వాటిని సచిన్ తన బ్యాట్‌తో అడ్డుకున్నాడు.

సచిన్ టెస్టుల్లో 51వ సెంచరీని 2011లో కేప్ టౌన్‌లో సాధించాడు. తన ఇన్నింగ్స్ మొదట్లోనే టెండూల్కర్ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ బౌలింగును ఎదుర్కొన్నాడు. ఆ సందర్బంగా డేల్ బౌలింగును సచిన ప్రశంసిస్తూ తన కెరీర్ మొత్తంలో అత్యుత్తమ స్పెల్‌ను ఆనాటి డేల్ స్టెయిన్ బౌలింగులోనే ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించాడు.

సచిన్ డబుల్ సెంచరీ పట్ల వివాదాస్పద వ్యాఖ్య చేసినప్పటికీ టెండూల్కర్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని డేల్ కొనియాడకుండా ఉండలేకపోయాడు. భారత ప్రేక్షకుల ముందు ఆడుతున్నప్పుడు సచిన్‌కు బౌలింగ్ వేయడం చాలా చాలా కష్టమని డేల్ వాపోయాడు. సచిన్ అసాధారణమైన ఆటగాడని, అతడిని ఎల్బీడబ్ల్యూ‌గా ఔట్ చేయడం చాలా అరుదుగా జరుగుతుందని డేల్ వ్యాఖ్యానించాడు.

ఒక్క చెత్తబంతిని వేసినా సచిన్ వదలడు.. ఆండర్సన్ ప్రశంసలు

డేల్ స్టెయిన్‌తో చిట్ చాట్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయవద్దని, ముఖ్యంగా బౌలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. 'ఒక్క చెత్త బంతిని కూడా సచిన్‌కు వేయకూడదు. ముఖ్యంగా భారత్‌లో అలాంటి తప్పిదం చేయవద్దు. ఆ ఒక్క బంతిని బౌండరీ తరలించే తన ఆటను మొదలు పెడతాడు. దాన్ని అలానే కొనసాగిస్తూ 500 పరుగులైనా చేస్తాడు. అప్పుడు నీ ప్రపంచం మొత్తం ముగిసిపోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. మనం అతన్ని ఔట్‌ చేయగలమనే ధీమాతోనే బంతులను సంధించాలంటూ ' అండర్సన్‌ పేర్కొన్నాడు.

 

IPL 2021: కింద మీద పడి  గెలిచిన  రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   5 hours ago


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   7 hours ago


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   12 hours ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   13 hours ago


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   11 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   17 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   20 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle