లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కి దక్కిన విజయం
27-06-202027-06-2020 08:33:38 IST
2020-06-27T03:03:38.115Z27-06-2020 2020-06-27T03:03:09.799Z - - 15-04-2021

ఎన్నాళ్ళ నుంచో వేచి వున్న విజయం దరిచేరితే ఆ ఆనందానికి హద్దేం వుంటుంది. టైటిల్ దక్కే వరకు విశ్రమించేది లేదన్న భగీరథ తరహా ప్రయత్నంలో లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ విజయవంతమైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లివర్‌పూల్ జయకేతనం ఎగురవేసింది. మూడు దశాబ్దాలకు పైగా ఊరిస్తూ వస్తున్న ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్‌ను అద్భుతంగా ఒడిసిపట్టుకుంది. లీగ్‌లో మరో ఏడు మ్యాచ్‌లు మిగిలుండగానే కప్‌ను లివర్‌పూల్ తమ ఖాతాలో వేసుకుంది. మాంచెస్టర్ సిటీపై చెల్సియా గెలుపు ఖరారు కాగానే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. గతేడాది పాయింట్ తేడాతో మాంచెస్టర్ సిటీ (98)కి టైటిల్ చేజార్చుకున్న కసిని కొనసాగిస్తూ విజయం సాధిస్తామని బరిలోకి దిగిన లివర్‌పూల్ (97) చరిత్ర లిఖించింది. 1990 తర్వాత ఈపీఎల్ కప్‌ను లివర్‌పూల్ దక్కించుకుంది. కరోనా వైరస్ కారణంగా మూడు నెలల తర్వాత కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య మొదలైన లీగ్‌లో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన లివర్‌పూల్ 86 పాయింట్లతో విజయం సాధించింది. మాంచెస్టర్ సిటీ (63), లీసెస్టర్ సిటీ (55), చెల్సియా (54).. లివర్‌పూల్ దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. శుక్రవారం మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా 2-1తో విజయం సాధించడంతో లివర్‌పూల్‌కు కప్ ఖరారైంది. కరోనా వ్యాప్తి కారణంగా ఓవైపు నిబంధనలు అమల్లో ఉన్నా.. పట్టరాని సంతోషంలో ఉన్న అభిమానులు వీధుల్లోకి వచ్చారు. లీగ్ 1888 లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు మిగిలుండగానే కప్‌ను దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచిన లివర్‌పూల్.. ఈపీఎల్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి దక్కించుకుంది. లాక్ డౌన్ వల్ల మూడునెలలు మ్యాచ్ ఆలస్యం అయినా లివర్ పూల్ జట్టు నిరాశ చెందలేదు. ఈనెల 17న పునఃప్రారంభం కావడంతో లివర్‌పూల్ టైటిల్ ఆశలు మళ్లీ చిగురించాయి. గత ఆదివారం మెర్సిసైడ్ డెర్బీలో జరిగిన మ్యాచ్‌ను లివర్‌పూల్ 0-0తో డ్రాగా ముగిసింది. 25న క్రిస్టల్ ప్యాలెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ 4-0తో గెలిచింది. లివర్‌పూల్ జట్టులో జుర్గెన్ క్లాప్ కీలకంగా వ్యవహరించాడని చెప్పాలి. సరిగ్గా నాలుగేండ్ల క్రితం జట్టు మేనేజర్‌గా బాధ్యతలు అందుకున్న క్లాప్ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాడు. అలీసన్ గోల్‌కీపింగ్ నైపుణ్యం లివర్‌పూల్ సుదీర్ఘ కలను సాకారం చేయడంలో కీలకమైంది. జట్టు విజయం అనంతరం క్లాప్ ఆనందానికి అవధులు లేవు. లివర్ పూల్ మొత్తం 31 మ్యాచ్ లు ఆడగా 28 గెలిచింది. 2 డ్రాగా నిలిచాయి. 1 మ్యాచ్ లో ఓడింది. 86 పాయింట్లతో కప్ గెలిచింది. మాంచెస్టర్ సిటీ మాత్రం 31 మ్యాచ్ లు ఆడితే కేవలం 20 మ్యాచ్ లు గెలిచి, 3 మ్యాచ్ లను డ్రా మగిల్చింది. 8 మ్యాచ్ లలో ఓడి కేవలం 63 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
an hour ago

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
2 hours ago

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
6 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
9 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
a day ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021
ఇంకా