newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాలాజలం పూసి బంతిని రుద్దకూడదా.. ఇక మా పని అయిపోయినట్లే.. ఇషాంత్‌ ధ్వజం

13-06-202013-06-2020 18:31:47 IST
Updated On 13-06-2020 19:04:53 ISTUpdated On 13-06-20202020-06-13T13:01:47.681Z13-06-2020 2020-06-13T13:01:43.994Z - 2020-06-13T13:34:53.281Z - 13-06-2020

లాలాజలం పూసి బంతిని రుద్దకూడదా.. ఇక మా పని అయిపోయినట్లే.. ఇషాంత్‌ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంతిని స్వింగ్ చేయడానికి దశాబ్దాలుగా బౌలర్లు బంతిని లాలాజలం పూసి రుద్దడం ద్వారా బ్యాట్స్‌మన్‌పై పైచేయి సాధించేవారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి దీనిపై కరోనా నేపథ్యంలో నిషేధం విధించింది. బంతికి లాలాజలం పూస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున ఐసీసీ ఆ అలవాటును నిషేధించింది. పైగా అలవాటులో పొరపాటుగా ఓ బౌలర్ అయినా అలా లాలాజలాన్ని వాడి బంతిని రుద్దితే రెండు సార్లు హెచ్చరించాక లాలాజలం పూసి బౌలింగ్ చేసిన ప్రతి బంతికీ ఐదు పరుగులను ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్‌కు కేటాయింస్తామని ఐసీసీ పేర్కొంది. ఇది బౌలర్లకు వెన్ను విరిచే చర్యేనని ప్రపంచ వ్యాప్తంగా బౌలర్లు వాపోతున్నారు. భారత్ పేస్ బౌలర్ ఇషాత్ శర్మ అయితే ఇక మా పని అయిపోయినట్లేనని ప్రకటించేశాడు.

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో క్రికెట్‌లో బంతిపై సలైవా(లాలాజలాన్ని) రుద్దడాన్ని రద్దు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ శాతం ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. వన్డే, టీ20 క్రికెట్‌లో సలైవాను రద్దు చేసినా ఫర్వాలేదు కానీ టెస్టు క్రికెట్‌లో అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, సలైవా రద్దుపై టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ స్పందించాడు. ఐసీసీ తీసుకున్న సలైవా రద్దు నిర్ణయాన్ని సుతిమెత్తగా విమర్శించాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఇషాంత్‌ సెటైరిక్‌గా మాట్లాడాడు. ప్రధానంగా టెస్టుల్లో సలైవా అనేది ఎంతగానో బౌలర్లకు సహకరిస్తుందని, బంతిని స్వింగ్‌ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నాడు.

‘బౌలర్లు బంతిని షైన్‌ చేయకపోతే బంతి స్వింగ్‌ కాదు. బంతి స్వింగ్‌ కాకపోతే అది బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా మారుతుంది.  మొత్తం బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం క్రికెట్‌గా మారిపోతుందనేది కాదనలేదని వాస్తవం. అటు బౌలర్‌కు  ఇటు బ్యాట్స్‌మన్‌కు పోరు అనేది ఉండదు. బంతిని రుద్దకపోతే బ్యాట్స్‌మన్‌గా ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల సలైవాను బంతిపై రుద్దడాన్ని రద్దు చేశారు. కానీ దీనికి ప్రత్యామ్నాయం అవసరం. టెస్టు క్రికెట్‌లో బంతిని షైన్‌ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందుకు ఐసీసీ వేరే పద్ధతిని తీసుకురావాల్సి ఉంది’ అని ఇషాంత్‌ పేర్కొన్నాడు. 

దుబాయ్‌ కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ ఆమోదముద్ర వేసింది. అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ చేసిన ఐదు సూచనలకు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కమిటీ (సీఈసీ) ఆమోదముద్ర వేసింది. అవేంటంటే.. బంతిపై మెరుపు తెచ్చేందుకు బౌలర్లు ఉమ్మి పూయరాదు. అయితే చెమటను మాత్రం రుద్దవచ్చు. ఒకవేళ ఆటగాళ్లు అలవాటులో పొరపాటుగా పదేపదే ఉమ్మి పూస్తే అంపైర్‌ రెండు సార్లు హెచ్చరిస్తారు. ఇదే పునరావృతమైతే.. 5 పరుగుల జరి మానా విధిస్తారు. ఈ రన్స్‌ ప్రత్యర్థి జట్టు ఖాతాలో వేస్తారు.  

చెమట రాకపోతే ఏం చేయాలి

చల్లటి వాతావరణం ఉండే ఇంగ్లండ్‌, కివీస్‌ల్లో ఏం చేయాలి. అక్కడైతే చెమట పట్టదు అక్కడ ఆడాలంటే థర్మల్‌ లేదా పొడవైన టీషర్ట్‌ వేసుకోవాలి. 1992లో నేను యార్క్‌షైర్‌కు ఆడినప్పుడు ఐదు పొరల దుస్తులు ధరించా. చెమట పట్టని పరిస్థితుల్లో బంతిని మెరిపించాలంటే ఏం చేయాలి. మేం ఆడే రోజుల్లో కొత్త బంతికి ఉమ్మిని పూసేవాళ్లం. రివర్స్‌ స్వింగ్‌ వస్తున్నప్పుడు చెమటను అద్దేవాళ్లం. ఒకవైపు బరువు పెరగడంతో సమతుల్యం లోపించి బంతి అనుకున్న దిశగా వెళ్తుంది. 

- సచిన్‌ టెండూల్కర్‌

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle