రో... హిట్ 'బ్రాండ్'..
02-12-201902-12-2019 09:56:14 IST
2019-12-02T04:26:14.083Z02-12-2019 2019-12-02T04:26:12.152Z - - 07-12-2019

టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల టెస్టుల్లో ఓపెనర్ గా ప్రమోషన్ పొందడంతో మూడు ఫార్మాట్లలో తనదైన శైలిలో రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. ఓ ఆటగాడు పరుగుల వరద పారిస్తుంటే యాడ్ ఏజెన్సీలు ఊరుకుంటాయా... అతని క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు పోటీ పడతాయి. ప్రస్తుతం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోసం కూడా పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి.
జూలైలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదేసి అరుదైన రికార్డ్‌లు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక డబుల్ సెంచరీ, సెంచరీలతో చెలరేగిపోయాడు. దీంతో.. టీ20, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ తిరుగులేని ఓపెనర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని పలు వ్యాపార సంస్థలు పోటీపడుతున్నాయి.
సియట్, అడిడాస్, రస్నా, షార్ప్ ఎలక్ట్రానిక్స్, డ్రీమ్ 11, ట్రూసాక్స్ వంటి దాదాపు 22 పైగా కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ రూ.73-75 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఒక్క ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10 కొత్త బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు.


రోహిత్ సంవత్సరంలో కనీసం రెండు రోజుల ఒప్పందానికి రోజుకు రూ.కోటి వసూలు చేస్తున్నట్లు మార్కెట్ నిపుణుల అంచనా. ఐఎమ్జీ రిలయన్స్ స్పాన్సర్షిప్ అధిపతి నిఖిల్ బార్దియా మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రోహిత్ తన బ్రాండ్ విలువను పెంచుకుంటున్నాడు. మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించాడని అన్నారు. కేవలం 2019 ఆర్థిక సంవత్సరంలోనే రోహిత్.. దాదాపు 55శాతం తన ఆదాయాన్ని పెంచుకున్నాడంటే రోహిత్ ఏరేంజ్‌లో సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

వెస్టిండీస్ తో డిసెంబరు 6 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకాబోతోంది. ఈ సిరీస్ నుంచి తొలుత రోహిత్ శర్మకి సెలక్టర్లు విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు. కానీ.. ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ అదే ఫామ్‌ని కొనసాగించాలని ఆశిస్తుండటంతో తనకి రెస్ట్ అవసరం లేదని సెలక్టర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడట. దీంతో అతడ్ని ఓపెనర్‌గా వెస్టిండీస్‌తో సిరీస్‌కి సెలక్టర్లు ఎంపిక చేశారు.






కళ్లు చెదిరే ఇన్నింగ్స్: టీమిండియా ఘనవిజయం
41 minutes ago

ఐపీఎల్ కు ముస్తాఫిజుర్ రెడీ..!
15 hours ago

నోబాల్ పై నిర్ణయం... ఇక మూడో అంఫైర్ దే
18 hours ago

ప్రతిదానికీ ధోనీ పేరెత్తితే ఏలాగబ్బా.. విసుక్కున్న కోహ్లీ
21 hours ago

కోహ్లీని ఔట్ చేయడం కష్టం... విండీస్ కోచ్ సిమన్స్
05-12-2019

పదేళ్లుగా బీసీసీఐ నాకెలాంటి నిధులు ఇవ్వలేదు..
05-12-2019

అతనో బేబీ బౌలర్ ..
05-12-2019

బ్రియాన్ లారా రికార్డు పై వార్నర్ కన్ను..
05-12-2019

విరాట్ దే అగ్రస్థానం...
04-12-2019

ఆర్చర్ కుదురుకుంటాడు.. త్వరలో అదరగొడతాడు
04-12-2019
ఇంకా