newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోహిత్ హాఫ్ సెంచరీ.. 200 మార్కు దాటలేకపోయిన ముంబై ఇండియన్స్

23-09-202023-09-2020 21:55:14 IST
2020-09-23T16:25:14.440Z23-09-2020 2020-09-23T16:25:00.872Z - - 14-04-2021

రోహిత్ హాఫ్ సెంచరీ.. 200 మార్కు దాటలేకపోయిన ముంబై ఇండియన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ముంబై ఇండియన్స్.. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు..! మొదటి 10 ఓవర్లు అద్భుతంగా ఆడుతుంది. కానీ చివరి 10 ఓవర్లు సరైన ఫినిషింగ్ ఉండదు. ఐపీఎల్-2020లో 5వ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ 200 మార్కును దాటలేకపోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ వికెట్ ను కోల్పోయింది. 3 బంతులు మాత్రమే ఆడిన డికాక్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు ఉన్నాయి.  ఐపీఎల్ లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడి లిస్టులో రోహిత్ శర్మ నిలిచాడు. భారత్ కు చెందిన ఆటగాళ్లలో ఆ మార్కును కేవలం ధోని మాత్రమే దాటాడు.  

రోహిత్ తో పాటూ సూర్య కుమార్ యాదవ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 47 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. సౌరబ్ తివారీ వేగంగా పరుగులు చేసే తరుణంలో అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 21 పరుగులు చేసిన సౌరబ్ తివారీ మరో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా రస్సెల్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. 13 బంతుల్లో పాండ్యా 21 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున 150వ మ్యాచ్ ఆడుతున్న కీరన్ పొలార్డ్ 7 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో ముంబై 195 పరుగులు చేసింది. ఒకానొక దశలో ముంబై 220 మార్కును తాకేలా కనిపించినప్పటికీ చివరి ఓవర్లలో కోల్ కతా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. శివమ్ మావి నాలుగు ఓవర్ల పాటూ బౌలింగ్ వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఒక మేడిన్ ఓవర్ కూడా ఉండడం విశేషం. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమిన్స్ 3 ఓవర్లలోనే 49 పరుగులు ఇచ్చాడు. 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   6 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle