newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

02-07-202002-07-2020 13:48:58 IST
Updated On 02-07-2020 16:48:04 ISTUpdated On 02-07-20202020-07-02T08:18:58.336Z02-07-2020 2020-07-02T08:18:43.001Z - 2020-07-02T11:18:04.784Z - 02-07-2020

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా బౌలర్లతో భారత ఓపెనర్ రోహిత్ శర్మకి పెద్ద సవాల్ ఎదురుకాబోతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టుల సిరీస్‌‌లో కంగారూలతో తలపడనుంది. గత పర్యటనలో ఆస్ట్రేలియాని టెస్టుల్లో 2-1 తేడాతో ఓడించిన భారత్ జట్టు ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్నారు.

2019, అక్టోబరు వరకూ టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో అనూహ్యంగా ఓపెనర్‌గా అవతారమెత్తి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. మూడు టెస్టుల ఆ సిరీస్‌లో వరుసగా 176, 127, 212 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా గత ఏడాది మొత్తంగా 92.66 సగటుతో ఏకంగా 556 పరుగులు చేశాడు. దాంతో.. అదే జోరుని ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ కొనసాగించాలంటే.. ఆ దేశ బౌలింగ్‌ అటాక్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హస్సీ చెప్పుకొచ్చాడు.

‘‘ఆస్ట్రేలియా‌లో టెస్టు సిరీస్‌ ఏ బ్యాట్స్‌మెన్‌కైనా సవాలే. కానీ.. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్‌లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లోనూ అతను జోరందుకున్నాడు. 

ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ అదే జోరుని కొనసాగిస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లపై.. అదీ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ని ఎదుర్కోవడం రోహిత్ శర్మకి సవాలే’’ అని హస్సీ వెల్లడించాడు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle