newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోహిత్‌–కోహ్లి జోడీని ఎలా విడగొట్టాలో చెప్పరూ..అంపైర్‌నే అడిగేసిన ఫించ్

15-06-202015-06-2020 09:50:31 IST
Updated On 15-06-2020 11:47:24 ISTUpdated On 15-06-20202020-06-15T04:20:31.783Z15-06-2020 2020-06-15T04:20:29.223Z - 2020-06-15T06:17:24.289Z - 15-06-2020

రోహిత్‌–కోహ్లి జోడీని ఎలా విడగొట్టాలో చెప్పరూ..అంపైర్‌నే అడిగేసిన ఫించ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మైదానంలో వీరవిహారం చేస్తున్న బ్యాట్స్‌మన్‌ని ఔట్ చేయడానికి ఏం చేయాలని నిర్ణయించుకోవలిసింది జట్టు కేప్టెన్ మాత్రమే. కానీ ప్రత్యర్థి టీమ్‌లో దిగ్గజ బ్యాట్స్‌మన్ లిద్దరు తన బౌలర్లను ఊచకోత కోస్తుంటే ఏం చేయాలో పాలుపోని ఆ కెప్టెన్ చివరకు నేరుగా అంపైర్ వద్దకే వెళ్లి మా వాళ్లను బాదిపడేస్తున్నారు. వాళ్లను ఔట్ చేయాలంటే ఏం చేయాలని అడిగేశాడు. దానికి ఆ అంపైర్ మరీ ఫన్నీగా జవాబిచ్చి తప్పుకున్నారు కానీ, క్రికెట్ మైదానంలో ఇలాంటి చర్చలు కూడా జరుగుతాయా అంటూ అందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుని నవ్వుతున్నారు.

టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మలు ఇద్దరూ కలిసి బ్యాటింగ్‌ చేస్తుంటే ఫ్యాన్స్‌కు ఎంత మజా వస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థి జట్టులో గుబులు మొదలవుతుంది. ఒక్కసారి వీరిద్దరూ క్రీజుల పాతుకపోతే బౌండరీల వర్షం.. పరుగుల వరద ఖాయం. అలా వీరిద్దరూ ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు, కెప్టెన్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. ఈ ఇద్దరూ భారత్‌ రన్ మెషిన్లుగా మారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టు బేలగా చూస్తుండిపోవాల్సిందే. 

ఇక ఈ ఇద్దరు జోడీగా చెలరేగితే ఆ విధ్వంసాన్ని ఎలా అడ్డుకోవాలో తెలీక ప్రత్యర్థి కెప్టెన్‌ తల పట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్న ఆస్ట్రేలియా సారథి ఆరోన్‌ ఫించ్‌... ఏం చేయాలో పాలుపోక మంచి సలహా కోసం చివరకు మ్యాచ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆనాటి మ్యాచ్‌ అంపైర్‌ మైకేల్‌ గౌఫ్‌ తాజాగా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ ఘటన జనవరిలో భారత్‌–ఆసీస్‌ మధ్య బెంగళూరులో మూడో వన్డే సందర్భంగా జరిగిందని గౌఫ్‌ బుధవారం పేర్కొన్నాడు. ‘ఆ మ్యాచ్‌ నాకు బాగా గుర్తుంది. విరాట్‌–రోహిత్‌ జోడీ భారీ భాగస్వామ్యం దిశగా పరుగులు తీస్తున్నారు. అప్పుడు స్క్వేర్‌ లెగ్‌ దగ్గర నా పక్కనే ఉన్న ఫించ్‌ నా దగ్గరికి వచ్చి ‘ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్ల ఆట నమ్మశక్యంగా లేదు. వీరిద్దరి ఆట చూడకుండా ఉండేదెలా? వారిద్దరికి నేనెలా బౌలింగ్‌ చేయించాలి? అని అడిగాడు. దానికి సమాధానంగా ‘నా పని నాకుంది. నీ పని నువ్వు చూస్కో’ అని చెప్పినట్లు’ గౌఫ్‌ పేర్కొన్నాడు. 

ఆ మ్యాచ్‌లో రెండో వికెట్‌కు విరాట్‌ (89), రోహిత్‌ (119) జోడీ నెలకొల్పిన 137 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్లతో గెలుపొందింది. దీంతో 2–1తో సిరీస్‌ భారత్‌ వశమైంది. ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్‌ గాఫ్‌ 62 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle