newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

రైనా స్థానాన్ని రాయుడితో భర్తీ చేస్తేనే మేలు.. స్కాట్ స్టయిరిస్

12-09-202012-09-2020 08:34:17 IST
2020-09-12T03:04:17.881Z12-09-2020 2020-09-12T03:04:14.392Z - - 01-10-2020

రైనా స్థానాన్ని రాయుడితో భర్తీ చేస్తేనే మేలు.. స్కాట్ స్టయిరిస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్‌ నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ప్రధాన ఆటగాడు సురేశ్‌ రైనా స్థానాన్ని అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టయిరిస్‌ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో మూడో స్థానంలో బరిలో దిగేందుకు రాయుడే సరైనవాడని అతను పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే సురేష్ రైనా, హర్బజన్ సింగ్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టుకు దూరంకావడంతో ఆందోళన చెందుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు తుది ఎంపికలో అంబటి రాయుడే సరైన సమాధానం అవుతాడని స్కాట్ స్టైరిష్ నొక్కి చెప్పాడు..

సురేష్ ‘రైనా లాంటి క్లాస్‌ క్రికెటర్‌ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్‌లో అద్భుతంగా ఆకట్టుకునే ప్లేయర్‌ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్‌ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్‌ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. మూడో స్థానంలో రాయుడు సరైన ఎంపిక. రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. దీనితో పాటు టాపార్డర్‌లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్‌ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే అని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్టయిరిస్‌ వివరించాడు.

సీఎస్కే ఒక బలమైన జట్టు అని తెలుసు. టాప్‌లో ఎవరు ఆడాలి అనేవిషయంలో వారికి చాలా ఐచ్ఛికాలు ఉన్నాయి. కానీ మూడో స్థానంలో ఆడేవారు ఎవరనేది జట్టును ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ స్థానానికి ఇప్పుడు సరైన ఆటగాడిని ఎంపిక చేయడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సవాలు చేస్తోంది. జట్టునాయకత్వం (ధోనీ, స్టీపెన్ ఫ్లెమింగ్) ఈ విషయమై జట్టు మొత్తాన్ని సమావేశపర్చి గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఎందుకంటే వారు ఇప్పటికే సురేష్ రైనా, హర్బజన్ సింగ్ వంటి క్లాస్ ఆటగాళ్లను పోగొట్టుకున్నారు అని స్కాట్ పేర్కొన్నాడు.

మూడో స్థానంలో ఆడించడానికి జట్టుకు అనేక అవకాశాలున్నాయి. ఇద్దరు విదేశీ ఆటగాళ్లు తొలి రెండు స్థానాల్లో ఆడుతున్నప్పుడు పంచ్ హిట్టర్‌గా యువకుడైన గయక్వాడ్ రుతురాజ్‌‌ని మూడో స్థానంలో ఆడించాలని కూడా వారు భావిస్తూ ఉండవచ్చు. పైగా రవీంద్ర జడేజాను కూడా ఆ స్థానంలో ఆడించే అవకాశం ఉంది. జడేజా ఎంత విధ్వంసకర ఆటగాడో అందరికీ తెలుసు. కానీ జట్టులో 3వ స్థానానికి అంబటిరాయుడిని ఎంపిక చేస్తేనే బాగుంటుందని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను అని స్కాట్ తెలిపాడు.

మూడో రౌండ్ కరోనా టెస్టులను గతవారం ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎట్టకేలకు మైదానంలో అడుగుపెట్టింది. ఈ దఫా ఐపీఎల్‌లో చివరగా శిక్షణ కోసం మైదానంలో అడుగుపెట్టిన జట్టు సీఎస్కేనే కావడం విశేషం. యూఏఈలో అడుగుపెట్టాక జట్టులోని కొంతమంది సబ్యులకు పాజిటివ్ అని తేలడంతో మొత్తం జట్టు స్వచ్చందంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది.

కాగా 13వ ఎడిషన్ ఐపీఎల్ పోటీలు సెప్టెంబర్ 19న మొదలై, నవంబర్ 10న ముగియనున్నాయి. యూఏఈలోని మూడు వేదికల్లో (అబుదుబాయ్, షార్జా, దుబాయ్) ఐపీఎల్ పోటీలు జరుగనున్నాయి.

 

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?

   9 hours ago


బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

   11 hours ago


ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

   11 hours ago


డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

   14 hours ago


వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

   15 hours ago


కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

   16 hours ago


రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

   29-09-2020


రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

   29-09-2020


థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

   29-09-2020


ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

   29-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle