రైనా స్థానంలో మలన్‌ను తీసుకోనున్న సీఎస్కే..!
11-09-202011-09-2020 13:20:13 IST
2020-09-11T07:50:13.466Z11-09-2020 2020-09-11T07:50:11.487Z - - 20-04-2021

సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఆరంభ కానుంది. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి. గత సీజన్లో తృటిలో కప్పు చేజారిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తోంది. అయితే.. ఇప్పటికే ఆజట్టులో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి ఇప్పటికే తప్పుకున్నారు. భజ్జీ లేకపోవడం ఇబ్బందే అయినా.. మిచెల్ శాంటర్నర్, ఇమ్రాన్ తాహిర్, కరణ్‌శర్మ, రవీంద్ర జడేజా, పీయూశ్ చావ్లా వంటి మేటి స్పిన్నర్లు ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సురేష్ రైనా ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. చెన్నై జట్టు సాధించిన విజయాల్లో సురేష్ రైనా కీలక పాత్ర పోషించాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. తాను మళ్లీ వస్తానని చెప్పినా.. టీమ్‌మెనేజ్‌మెంట్ పెద్దగా ఆసక్తికనబర్చలేదు. అయితే సురేశ్ రైనా స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంచలనం డేవిడ్ మలన్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు సీఎస్కే మేనేజ్మెంట్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలను సీఎస్కే ప్రారంభించిందని ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలిపింది. పొట్టి ఫార్మాట్లో మలన్ 16 మ్యాచ్‌లే ఆడినప్పటికి.. ఈ ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మలన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రైనాలాగే మలన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో.. అతన్ని తీసుకుంటే కలిసి వస్తుందని చెన్నై భావిస్తోంది. రైనా స్థానంలో డేవిడ్ మలన్ తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై కేవలం చర్చలు మాత్రమే జరిగాయని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సీఎస్కే టీమ్ అధికారి ఒకరు తెలిపారు. మలన్ పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, అతను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో టీమ్ కాంబినేషన్ కూడా దెబ్బతినదన్నారు. అయితే.. మలన్ తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి తెలిపారు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
15 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
a day ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
18-04-2021

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా