newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైనా మేనత్త ఇంట్లో దారుణానికి పాల్పడ్డ రాక్షసుల అరెస్టు

16-09-202016-09-2020 18:59:38 IST
Updated On 16-09-2020 18:59:34 ISTUpdated On 16-09-20202020-09-16T13:29:38.105Z16-09-2020 2020-09-16T13:27:53.443Z - 2020-09-16T13:29:34.532Z - 16-09-2020

రైనా మేనత్త ఇంట్లో దారుణానికి పాల్పడ్డ రాక్షసుల అరెస్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెటర్‌ సురేష్‌ రైనా మేనత్త కుటుంబం మీద జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలమైంది. ఆగస్టు 19వ తేదీన పఠాన్‌కోట్‌, తర్యల్‌లోని రైనా మేనత్త కుటుంబంపై ఓ ముఠ దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్‌ కుమార్‌(రైనా మామ) సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. ఆయన కుమారుడు కౌశల్‌ కుమార్‌ ఆగస్టు 31న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సురేష్‌ రైనా మేనత్త ఆశా రాణి పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉంది. దాడిలో గాయపడ్డ మరి కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ కేసును స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ దాదాపు 100మంది అనుమానితుల్ని విచారించింది. తాజాగా పంజాబ్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠా ఈ ఘోరానికి పాల్పడినట్లు సిట్‌ అధికారులు తేల్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని బుధవారం అరెస్ట్‌ చేశారు.

సిట్ బృందం పట్టుకున్న ముగ్గురు సావన్ అలియాజ్ మాచింగ్, ముహబ్బత్, షారుఖ్ ఖాన్ లు గా గుర్తించారు. సావన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు కాగా.. మిగిలిన ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వారు.

ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో ఇలాంటి దొంగతనాలు చేశామని.. తమ గ్రూప్ లో మరికొంత మంది కూడా ఉన్నారని తెలిపారు. రైనా మేనత్త ఇంటి ముందు రెక్కీ నిర్వహించామని.. ఆగస్టు 19న రాత్రి 8 గంటల సమయంలో ముందుగా అనుకున్న చోటుకు వెళ్లాం. జమాయిల్ కర్రలను కూడా వెంట తెచ్చుకున్నాం.  వెదురు కర్రల సాయంతో మొదటగా రెండు ఇళ్లలోకి చొరబడ్డాం. మూడో ఇల్లు అశోక్ కుమార్‌ది. కర్రల సాయంతో ఐదుగురం ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు వ్యక్తులు చాప మీద పడుకొని ఉండటాన్ని గమనించి.. వారి తలమీద కర్రలతో బాదాం. ఆపై మరో ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యామని ముఠా సభ్యులు విచారణలో ఒప్పేసుకున్నారు.

ఈ విషయం తెలియగానే రైనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారత్ కు చేరుకున్నాడు. తమ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుందని రైనా బాధను వ్యక్తం చేశాడు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle