newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైనా ఇంత అబద్ధమాడతాడని అనుకోలేదు.. ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ

07-05-202007-05-2020 12:44:51 IST
Updated On 07-05-2020 12:51:22 ISTUpdated On 07-05-20202020-05-07T07:14:51.740Z07-05-2020 2020-05-07T07:14:49.591Z - 2020-05-07T07:21:22.410Z - 07-05-2020

రైనా ఇంత అబద్ధమాడతాడని అనుకోలేదు.. ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దశాబ్దానికి పైగా తనదైన ముద్ర వేసిన సురేశ్‌ రైనా 2018 జూలైæ తర్వాత జట్టులోకి ఎంపిక కాలేదు. తనను తొలగించడానికి సెలక్టర్లు ఎలాంటి కారణం చూపించలేదని, ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకొని పునరాగమనం చేసే వాడినని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైనా వ్యాఖ్యానించాడు. దీనిపై నాటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందించాడు. రైనా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశాడు.

‘'టీమిండియాలో తన స్థానంపై వేటు గురించి నేను స్వయంగా రైనాకు చెప్పాను. తిరిగి రావాలంటే ఏం చేయాలో కూడా వివరించాను. ఇప్పుడు అతను అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలీదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్‌ ప్లేయర్‌ ఎవరైనా దేశవాళీలో అద్భుతంగా ఆడి తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైనా వెనుకబడ్డాడు అని ఎమ్మెస్కే వివరించాడు.

ఇతర యువ ఆటగాళ్లు, ‘ఎ’ జట్టు సభ్యుల ఆటతో పోలిస్తే రైనా ప్రదర్శన బాగా లేదు. మేం యూపీ రంజీ మ్యాచ్‌లు చూడలేదనే విమర్శలు కూడా అబద్ధం. నేను స్వయంగా రెండు మ్యాచ్‌లు చూశాను. రైనా ఆట సంతృప్తికరంగా లేదు’ అని ప్రసాద్‌ స్పష్టం చేశారు. 

1999లో భారత టెస్ట్ జట్టు నుంచి వీవీఎస్ లక్ష్మణ్‌ని పక్కనపెట్టినప్పుడు దేశవాళీ క్రికెట్‌లో భీకరమైన ఫామ్ చూపి 1400 పరుగులు చేయడం ద్వారా వీవీఎస్ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడని సీనియర్ ఆటగాళ్ల నుంచి జట్టు యాజమాన్యం ఆశించేది ఇలాంటి ప్రదర్శననే అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. దురదృష్టవశాత్తూ దేశవాళీ క్రికెట్లో రైనా అలాంటి సామర్థ్యం చూపలేకపోయాడని ప్రసాద్ వివరించాడు.

కాగా 2018–19 రంజీ సీజన్‌లో యూపీ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన రైనా 2 అర్ధసెంచరీలతో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ 17 మ్యాచ్‌లలో కేవలం 383 పరుగులు చేశాడు. ధోనీ ఎంత సపోర్ట్ చేసినప్పటికీ ఐపీఎల్‌లో కూడా రైనా ఆటతీరు మెరుగు కాకపోవడంతో చివరకు 2018 నుంచి జట్టునుంచే స్థానం కోల్పోయాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle