newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైనాను సొంత కొడుకులాగే చూసుకున్నా కానీ... శ్రీనివాసన్

03-09-202003-09-2020 07:03:19 IST
Updated On 03-09-2020 07:46:30 ISTUpdated On 03-09-20202020-09-03T01:33:19.450Z03-09-2020 2020-09-03T01:33:17.892Z - 2020-09-03T02:16:30.180Z - 03-09-2020

రైనాను సొంత కొడుకులాగే చూసుకున్నా కానీ... శ్రీనివాసన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌లో సీఎస్‌కే(చెన్నై సూపర్‌కింగ్స్‌) తరుపున రైనా ఆడతాడని అందరు భావించినప్పటికీ, తన మేనమామ దారుణ హత్య నేపథ్యంలో ైనా హుటాహుటిన భారత్‌కు బయల్దేరాడు. అప్పటినుంచి రైనా నిష్క్రమణ గురించి సంచలన వార్తలు, వ్యాఖ్యానాలు రోజుకొకటిగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటికి పరాకాష్ట అన్నట్లుగా తాజాగా సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ తనకు తండ్రిలాంటి వాడని సురేష్ రైనా ఉద్వేగ ప్రకటన చేయగా అంతే భావోద్వేగాన్ని పండించిన శ్రీనివాసన్ తాను రైనాను సొంత కొడుకు లాగే చూసుకున్నా అని పేర్కొని ఈ మొత్తం ఉదంతంలో సాగుతున్న నాటకీయతను మరింత రక్తి కట్టించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోని గుడ్‌బై ప్రకటించిన వెంటనే సురేశ్‌ రైనా రిటైర్‌మెంట్‌ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే త్వరలో  సీఎస్‌కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా ఇంటిబాట పట్టాడని పుకార్లు వచ్చాయి. అయితే రైనా మాత్రం శ్రీనివాసన్‌ తనకు తండ్రి లాంటివారని చెబుతున్నాడు. ఈ అంశంపై ఎన్‌.శ్రీనివాసన్‌ స్పందిస్తూ.. రైనా చెప్పింది నిజమేనని, అతనిని తన సొంత కొడుకు లాగా చూసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో సీఎస్‌కే వరుస విజయాలకు ప్రధాన కారణం ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే అని తెలిపారు. గత నలబై సంవత్సరాలుగా ఇండియా సిమెంట్స్ క్రికెట్‌ ఫ్రాంచైజీలతో సంబంధం ఉంది. 

ఐపీఎల్‌లో రైనా ఆడాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు శ్రీనివాసన్‌ స్పందిస్తూ.. తాము టీమ్‌ను మాత్రమే ఫ్రాంచైజీగా(కొనుగోలు) తీసుకున్నామని, ఆటగాళ్లను కాదని తెలిపారు. కాగా రైనా ఐపీఎల్‌లో ఆడతాడో లేదో తాను చెప్పలేనని, తాను జట్టుకు కెప్టెన్‌ను కాదని అన్నారు. సీఎస్‌కేకు అద్భుతమైన కెప్టెన్‌ ఉండగా ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. రైనా తిరిగి జట్టులోకి వస్తాడా లేదా అనేది తేల్చవలసింది కెప్టెన్ మాత్రమేనని స్పష్టం చేశారు. 

దీనిపై తాజాగా రైనా స్పందిస్తూ తనకు, చెన్నై టీంకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కుటుంబం కోసమే ఐపీఎల్‌ నుంచి వెనక్కొచ్చానని పేర్కొన్నాడు. తనకు సీఎస్‌కే తో రూ.12.5 కోట్ల కాంట్రాక్టు ఉందని, చిన్న కారణాలతో ఎవరైనా రూ.12.5 కోట్లు వదులుకుంటారా అని ప్రశ్నించారు. శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటి వారని, ఆయన తనకు అండగా నిలిచారని  ఒకవేళ వీలు కుదిరితే ఈ సీజన్‌లోనే చెన్నైకి ఆడతానని రైనా స్పష్టం చేశారు. 

ఈ ట్విస్టును చూస్తుంటే రైనా ఇప్పటికే శ్రీనివాసన్‌తో మాట్లాడాడని, తాను త్వరలో జట్టులోకి తిరిగి వస్తానని చెప్పాడని గుసగుసలు వినపడుతున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle